చిమ్మిరి
ఉండలు .
ఆలూరి కృష్ణ ప్రసాద్
image courtesy: google |
కావలసిన
పదార్ధములు.
వేయించిన
శనగపప్పు -- 50
గ్రాములు
నువ్వు పప్పు
తెల్లనిది ---- 100 గ్రాములు
బెల్లం --
100 గ్రాములు
ఎండు కొబ్బరి
-- ఒకచిప్ప.
తయారీ
విధానము .
ముందుగా ఎండు
కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
బెల్లం
పొడిలా దంచుకోవాలి . ముక్కలుగా మిక్సీలో వేస్తే
మిక్సీ బ్లేడ్స్ విరగవచ్చు.
నువ్వు పప్పు
వేయించ నవసరం లేదు .
ఇప్పుడు
మిక్సీలో ముందుగా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుని
గ్రైండ్ చేయాలి .
ఆ తర్వాత
తెల్ల నువ్వు పప్పు , పుట్నాల పప్పు ,
మిక్సీలో వేసి మూడు
మెత్తగా అయ్యాక చివరగా బెల్లం పొడి కూడా వేసి
మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
ఈ మూడింటి
మిశ్రమం ఒక ప్లేటులోనికి తీసుకొని ఉండలుగా
చేతితో కట్టుకోవాలి .
అంతే
రుచికరమైన చిమ్మిరి ఉండలు సిద్ధం.
బాగా నీరసంగా
అన్పించినప్పుడు ఒకటి రెండు ఉండలు తీసుకుంటే నీరసం
మటు మాయం.
ఎక్కువగా
తింటే నువ్వులు వేడి చేయవచ్చు .
0 comments:
Post a Comment