క్యాబేజి పెసర మసాలా వడలు .
ఆలూరు కృష్ణప్రసాదు .
కావలసినవి .
ముడి పచ్చ పెసలు -- 150 గ్రా.
క్యాబేజి -- 150 గ్రా.
ఉల్లిపాయలు - రెండు
పచ్చిమిర్చి -- పన్నెండు
కరివేపాకు -- మూడు రెమ్మలు
పొదినా ఆకు - పావు కప్పు
శనగపిండి -- రెండు స్పూన్లు
అల్లం --- చిన్న ముక్క
జీలకర్ర -- పావు స్పూను
నూనె -- 200 గ్రాములు .
పెసల వడలు తయారీ విధానము .
ఈ పెసల వడలకు ముడి పచ్చ పెసలే వాడాలి .
పెసర పప్పు కాని , చాయపెసరపప్పు కాని వాడ కూడదు . రుచిగా ఉండదు .
ముందుగా ముడి పెసలు తగినన్ని నీళ్ళలో మూడు గంటల సేపు నానపెట్టుకోవాలి .
తర్వాత నానిన పెసలలో ని నీళ్ళు వంపేసి మిక్సీ లో నీళ్ళు పోయకుండా కచ్చా పచ్చాగా వేసుకోవాలి .
క్యాబేజి చిన్న ముక్కలుగా తరుగుకోవాలి .
ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా తరుగుకోవాలి .
పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా తరుగు కోవాలి .
అల్లం పై చెక్కు తీసి చిన్న ముక్కలుగా తరుగు కోవాలి .
కరివేపాకు సన్నగా తరుగుకోవాలి .
పొదినా ఆకులు వలిచి సిద్ధంగా ఉంచుకోవాలి .
ఇప్పుడు ఒక గిన్నెలో గ్రైండ్ చేసుకొని సిద్ధంగా ఉంచుకున్న ముడి పెసల మిశ్రమం , తరిగిన క్యాబేజి ముక్కలు , తరిగిన ఉల్లిపాయల ముక్కలు , తరిగిన కరివేపాకు ,
తరిగిన పచ్చిమిర్చి ముక్కలు , పొదీనా ఆకు , శనగ పిండి , జీలకర్ర , సరిపడా ఉప్పువేసి కొద్దిగా నీళ్ళు పోసుకుని చేత్తో బాగా కలుపు కోవాలి .
పిండి వడలుగా వేయటానికి అనుగుణంగా కలుపు కోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి నూనె మొత్తము వేసి నూనె బాగా కాగిన తర్వాత కలిపిన పిండిని ఉండలుగా చేసుకుని అర చేతితో చిన్న వడలుగా చేసుకొని నూనెలో బంగారు రంగులో వేయించుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే క్యాబేజి పెసల మసాలా వడలు టిఫిన్ గా సేవించడానికి సిద్ధం.
ఈ వడలు వేడి వేడిగా అన్నం లోకి కూడా చాలా రుచిగా ఉంటాయి ,
ఫోటో -- మా ఇంట్లో చేసిన క్యాబేజి పెసల వడలు .
0 comments:
Post a Comment