Thursday, June 1, 2017

దధ్యోజనం .

దధ్యోజనం .
ఆలూరి కృష్ణ ప్రసాద్ 


తయారీ విధానము .
కమ్మని మీగడ పెరుగు అన్నంలో కలిపి , తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి .
అల్లం పై చెక్కు తీసి , అయిదు పచ్చి మిరపకాయలు మిక్సీ వేసి కలుపు కోవాలి .
కొత్తిమీర సన్నగా తరిగి కలుపు కోవాలి .
స్టౌ మీద పోపు గరిట పెట్టి మూడు స్పూన్లు నెయ్యి వేయాలి .
పోపులో ఎండు మిర్చి మినపప్పు , పచ్చి శనగపప్పు , జీలకర్ర మరియు ఆవాలు వేసి వేయించుకుని పోపును పెరుగన్నంలో కలుపు కోవాలి .
కమ్మ కమ్మని ' దధ్యోజనం ' సేవించడానికి సిద్ధం .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి