Thursday, June 1, 2017

గుంటూరు స్పెషల్ -పచ్చి మిరపకాయల కారం.

గుంటూరు స్పెషల్ -పచ్చి మిరపకాయల కారం.
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 

కావలసినవి .
పచ్చిమిరపకాయలు - 50 గ్రా
చింతపండు - 30 గ్రా
ఉప్పు -- తగినంత 
బెల్లం - చిన్న ముక్క 
పసుపు - కొద్దిగా 
నూనె -- అయిదు స్పూన్లు

పోపుకు .
పొట్టు మినపప్పు -- స్పూనున్నర .
ఆవాలు - అర స్పూను 
మెంతులు -- పావు స్పూను 
ఇంగువ -- మరి కాస్త

తయారీ విధానము .
పచ్చిమిర్చి తొడిమలు తీసి కడిగి ఆర నివ్వాలి .
స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి , నూనె బాగా కాగగానే పచ్చిమిర్చి వేసి మూత పెట్టు కోవాలి.
మూత పెట్టకపోతే పచ్చిమిర్చి పేలతాయి.
మూడువంతులు పైగా మగ్గాక కొద్దిగా పసుపు వేసి దింపుకోవాలి.
చింతపండు విడదీసి తడుపుకుని ఉంచుకోవాలి .
తర్వాత స్టౌ మిద బాండీ పెట్టి మిగిలిన రెండు స్పూన్లు నూనె వేసి 
మినపప్పు , మెంతులు , ఆవాలు , ఇంగువ వేసి పోపు వేసుకోవాలి .

పచ్చిమిరపకాయలు కారం కాబట్టి పోపులో ఎండుమిర్చి వేయనక్కరలేదు .
రోటి సౌకర్యం ఉంటే రోటిలో నూరుకోండి .
ఇప్పుడు రోటిలో మగ్గబెట్టిన పచ్చిమిర్చి , చింతపండు , ఉప్పు మరియు చిన్న బెల్లం ముక్క వేసి పచ్చడి బండతో దంపుకోండి.
చివరగా పోపు కూడా వేసి పచ్చడి నాలుగు మూలలా నూరుకోండి .
చాలా చాలా రుచిగా ఉంటుంది .
ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది.
చింతపండు సమంగా పడకపోతే కారంగా ఉంటుంది .
చూసి వేసుకోండి .
ఈ పచ్చడి అన్నం లోకి , ఇడ్లీ , దోశెల లోకి కూడా బాగుంటుంది .
ఇది అచ్చంగా పచ్చి మిరపకాయల కారం కాబట్టి కొత్తిమీర , కరివేపాకు వెయ్యము .
మీరు కావాలనుకుంటే వేసుకోండి.
లేకపోతే మిక్సీలో వేసుకోండి.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి