లేత బెండకాయలు
--350 గ్రాములు.
ఎండుమిరపకాయలు
- 15
ఉల్లిపాయలు --
పెద్దవి రెండు
శనగపప్పు --
పావు కప్పు
మినపప్పు --
పావు కప్పు
ధనియాలు --
అయిదు టీ స్పూన్లు .
జీలకర్ర --
ఒక టీ స్పూను
ఆవాలు --
ఒక స్పూను
మెంతులు --
ఒక స్పూను
ఇంగువ --
కొద్దిగా
అల్లం --
చిన్న ముక్క
ఎండు కొబ్బరి
-- అర చిప్ప తీసుకొని చాకుతో చిన్న చిన్న
ముక్కలు గా చేసుకోవాలి.
పసుపు --
కొద్దిగా
ఉప్పు --
తగినంత
నూనె --
నాలుగు గరిటలు
మసాలా ముద్ద
తయారు చేసే విధానము .
ముందు స్టౌ
మీద బాండీ పెట్టి ఒక గరిటన్నర నూనె
వేసి నూనె బాగా కాగాక వరుసగా మెంతులు, ఎండు మిర్చి,ధనియాలు , శనగపప్పు , మినపప్పు , జీలకర్ర , ఆవాలు, ఇంగువ వేసి వేయించుకోవాలి .
చిన్నగా
తరిగిన ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేయించు కోవాలి.
చల్లారగానే
మిక్సీలో వేసి తగినంత ఉప్పు , కొద్దిగా
పసుపు వేసి కొంచెం బరకగానే మిక్సీ
వేసుకోవాలి.
ఇప్పుడు
అల్లం చిన్న చిన్న ముక్కలుగా తరిగి మిక్సీలో
వేయాలి.
ముక్కలుగా
తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు కూడా ఆ మసాలా
మిశ్రమంలో వేసి కాస్త పప్పులు తగిలే విధంగానే
మిక్సీ వేసుకోవాలి.
లేత
బెండకాయలు శుభ్రంగా కడిగి ఆ చివర ఈ
చివర ముచికెలు తీసేసి నిలువుగా చాకుతో గాటు
పెట్టుకోవాలి .
ఇప్పుడు
మసాలా మిశ్రమాన్ని రెండు భాగాలుగా చేసుకొని ఒక
భాగాన్ని బెండ కాయల్లో కూరుకుని రెండో భాగాన్ని
ప్రక్కన ఉంచుకోవాలి .
ఇప్పుడు స్టౌ
మీద బాండీ పెట్టి మిగిలిన నూనె పోసి , నూనె బాగా కాగాక
మసాలా కూరిన బెండకాయలు అన్నీ బాండీలో వేసి
మూత పెట్టి సన్నని సెగన మధ్య మధ్య అట్లకాడతో
కాయల్ని మసాలా అడుగంట కుండా కదుపుతూ ఉండాలి.
కాయలు మసాలా
వేగిన కమ్మని వాసన రాగానే విడిగా ఉంచుకున్న
మిగిలిన మసాలా కూడా వేసి మరో అయిదారు నిముషాలు
ఉల్లిపాయలోని పచ్చి వాసన పోయేదాకా మగ్గనిచ్చి స్టౌ
మీద నుండి దింపి వేరే ప్లేటు లోకి తీసుకోవాలి.
అంతే ఎంతో
రుచికరమైన బెండకాయల మసాల కూర ఘమ ఘమ వాసనలతో
సర్వింగ్ కు సిద్ధం.
0 comments:
Post a Comment