మిక్స్డ్ వెజిటబుల్ కూర
ఆలూరు కృష్ణప్రసాదు .
పూరీల లోకి , రోటీల లోకి , చపాతీల లోకి మరియు భోజనము లోకి ఉపయోగించే బలవర్ధకమైన మిక్సెడ్ వెజిటబుల్ కూర .
మిక్సెడ్ వెజిటబుల్ కూర .
కావలసినవి .
బంగాళా దుంపలు -- 2
తరిగిన క్యాలీఫ్లవర్ -- ఒక కప్పు .
ఉల్లిపాయలు - 2
క్యారెట్ --- 2
టమోటో లు - 3
పచ్చి బఠాణీలు -- ఒక కప్పు.
పచ్చిమిరపకాయలు -- 6
అల్లం -- రెండు అంగుళముల ముక్క చిన్న ముక్కలుగా చేసుకోవాలి ,
పసుపు -- పావు టీ స్పూను
ఉప్పు -- తగినంత
కారం -- ఒక స్పూను
నూనె -- నాలుగు స్పూన్లు
పోపు నకు .
ఎండుమిరపకాయలు -- 4 ముక్కలుగా చేసుకోవాలి .
పచ్చి శనగపప్పు -- స్పూనున్నర .
మినపప్పు -- స్పూను
జీలకర్ర -- పావు స్పూను .
ఆవాలు -- అర స్పూను
ఇంగువ -- కొద్దిగా
కరివేపాకు -- మూడు రెమ్మలు .
తయారీ విధానము .
ముందుగా బంగాళా దుంపలు , క్యారెట్ ముక్కలు గా తరిగి ( క్యారెట్ పై చెక్కు తీయ నవసరం లేదు ) కుక్కర్ లో సరిపడా నీళ్ళు పోసి రెండు విజిల్స్ రానిచ్చి , దింపుకుని బంగాళా దుంపల పై చెక్కు తీసుకుని ఈ రెండు వేరుగా
ఉంచుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి మొత్తము నూనె పోసి నూనె బాగా కాగగానే , వరుసగా ఎండుమిర్చి , పచ్చి శనగపప్పు , మినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ , అల్లం ముక్కలు మరియు కరివేపాకు వేసి పోపు వేయించుకుని పోపు వేగగానే వరుసగా ముందుగా తరిగిన ఉల్లిపాయలు , పసుపు , కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి ఉల్లిపాయలు సగానికి పైగా మగ్గనివ్వాలి .
తర్వాత సన్నగా తరిగిన , క్యాలిఫ్లవర్ , ముక్కలు గా తరిగిన టమోటో లు , పచ్చి బఠాణీలు , ఉడికించిన క్యారెట్ ముక్కలు , ఉడికించిన బంగాళాదుంప ముక్కలు , అన్నీ వేసి సరిపడా ఉప్పు వేసి పూర్తిగా ముక్కలన్నీ కూరలో కలిసి పోయే విధముగా ముక్కలు చితక కుండా కలుపుకుంటూ చివరలో ఒక స్పూను కారం వేసుకుని , పూర్తిగా మగ్గగానే దించి వేరే డిష్ లోకి తీసుకోవాలి .
పూరీ చపాతీ రోటీలలోకి అయితే ఇలాగే ముద్ద కూరగా అద్దుకుని తినవచ్చు .
లేని పక్షంలో రెండు స్పూన్లు శనపిండి అర గ్లాసు నీళ్ళలో వేసి బాగా కలిపి , మగ్గుతున్న కూరలో వేసి మరో అయిదు నిముషముల పాటు ఉంచి దింపుకుంటే కూర కొంచెం పల్చగా బాగుంటుంది .
అంతే ఎంతో రుచిగా ఉండే మిక్సెడ్ వెజిటబుల్ కూర పూరీ , రోటీ , చపాతీ మరియు అన్నం లోకి సర్వింగ్ కు సిద్ధం .
0 comments:
Post a Comment