ఇడ్లీ లోకి
కారప్పొడి .
ఆలూరి కృష్ణ ప్రసాద్
కావలసినవి .
ఎండు మిర్చి
-- 20
పచ్చి శనగపప్పు
-- పావు కప్పు
చాయ మినపప్పు
-- పావు కప్పు
ధనియాలు --
పావు కప్పులో సగం.
కరివేపాకు
దూసినది -- అర కప్పు .
ఉప్పు ---
తగినంత
తయారీ
విధానము .
ముందుగా
కరివేపాకు శుభ్రం చేసుకొని తడి లేకుండా ఆర బెట్టు
కోవాలి .
ఇప్పుడు స్టౌ
వెలిగించి బాండీ పెట్టి నూనె వెయ్యకుండా
ఎండు మిర్చి , ధనియాలు , పచ్చి శనగపప్పు , చాయ మినపప్పు వేసి
కమ్మని వాసన వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి . వేగుతుండగానే ఆర
బెట్టిన అర కప్పు కరివేపాకు కూడా వేసి ఆకులో
పచ్చి పోయేదికా వేయించుకోవాలి.
చల్లారగానే
ముందుగా ఎండుమిరపకాయలు ,
పచ్చి శనగపప్పు , చాయ మినపప్పు , ధనియాలు , కరివేపాకు
మిశ్రమం తగినంత ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా
కొంచెం పప్పులు తగిలేటట్లుగా మిక్సీ వేసుకోవాలి .
అంతే ఇడ్లీల
లోకి , దోశెల లోకి ఘమ ఘమ లాడే వాసనతో కారప్పొడి
సిద్ధం.
ఈ ఇడ్లీ పొడి
నెల రోజులు పైగా తాజాగా ఉంటుంది .
*****************************
కరివేపాకు
కారప్పొడి ( నల్ల కారం ) .
అదే అన్నం
లోకి అయితే బాండీలో నూనె అయిదు స్పూన్లు
వేసుకుని ,
ఎండుమిరపకాయలు - 25 , ధనియాలు -
అరకప్పు , చాయ మినపప్పు - మూడు స్పూన్లు , కరివేపాకు -
ఒక కప్పు ,
ఆవాలు --
పావు స్పూను , జీలకర్ర -- పావు స్పూను వేసి బాగా
వేయించుకొని చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని
మిక్సీలో వేసి , తగినంత ఉప్పు , నిమ్మకాయంత గింజలు తీసి
రెబ్బలుగా విడదీసిన చింతపండు వేసి మెత్తగా
మిక్సీ వేసుకోవాలి .
చివరగా ఓ పది
పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి .
వెల్లుల్లి
ఇష్టం లేని వారు మరో పావు కప్పు కరివేపాకు
వేసుకోండి .
అంతే ఘమ ఘమ
లాడే నల్ల కారం ( కరివేపాకు కారప్పొడి )
భోజనం లోకి
సిద్ధం .
********************
0 comments:
Post a Comment