పూరిలోకి ఉల్లిపాయ కూర
ఆలూరి కృష్ణ ప్రసాద్
నాలుగు పెద్ద ఉల్లిపాయలు ముక్కలుగా తరుగుకోవాలి.
స్టౌ మీద బాండీ పెట్టి నాలుగు స్పూన్లు నూనె వేసి నూనె కాగగానే పోపులో మూడు ఎండు మిర్చి ముక్కలుగా చేసి వేసుకోవాలి .
వరుసగా రెండు స్పూన్లు పచ్చి శనగపప్పు , స్పూను మినపప్పు , పావు స్పూను జీలకర్ర , అర స్పూను ఆవాలు, మూడు పచ్చి మిరపకాయలు ముక్కలు, రెండు రెబ్బలు కరివేపాకు దూసివేయాలి. అందులో ఉల్లిపాయల ముక్కలు , తగినంత ఉప్పువేసి ఉల్లిపాయలు నల్ల బడకుండా మగ్గనివ్వాలి.
ఉల్లిపాయలు మగ్గాక అరగ్లాసు నీళ్ళలో రెండు స్పూన్లు శనగపిండి వేసి బాగా కలిపి , ఆ నీళ్ళు కూరలో పోసి అయిదు నిముషాలు ఉడకనివ్వాలి .
కూర అసలు రుచి తెలియాలంటే ఇంక కారం అక్కరలేదు. ఉల్లిపాయల తీపి తెలుస్తుంది . పచ్చిమిర్చి కారం చాలు .
కాదు కారంగా ఉండాలనుకుంటే స్పూను కారం వేసుకోండి . మేం కారం వేసుకోం.
రెండు మూడు సార్లు ఈ ఉల్లిపాయల కూర పోస్టింగు పెట్టాను . మిమ్మల్ని వెతుక్కోమంటే బాగుండదని మళ్ళీ మీకు చెప్పాను .
0 comments:
Post a Comment