తోటకూర గారెలు .
ఆలూరి కృష్ణ ప్రసాద్
తయారీ విధానము .
ఒక కప్పు మినపప్పు నాలుగు గంటల పాటు నీళ్ళలో నానబెట్టి తర్వాత గారెలు వేయుటకు అనువుగా గ్రైండ్ చేసుకోవాలి .
కప్పు తరిగిన తోటకూర , తరిగిన అల్లం , తరిగిన పచ్చిమిర్చి , స్పూను జీలకర్ర , తరిగిన కరివేపాకు , ఉల్లి పాయల ముక్కలు అన్నీ ఈ పిండిలో వేసి బాగా కలుపు కోవాలి .
స్టౌ మీద బాండీ పెట్టి 200 గ్రాముల నూనె వేసి నూనె బాగా కాగగానే గారెలు మాదిరిగా వేసుకోవాలి .
అంతే వేడి వేడి రుచికరమైన తోటకూర గారెలు సర్వింగ్ కు సిద్ధం .
ఒక కప్పు మినపప్పు నాలుగు గంటల పాటు నీళ్ళలో నానబెట్టి తర్వాత గారెలు వేయుటకు అనువుగా గ్రైండ్ చేసుకోవాలి .
కప్పు తరిగిన తోటకూర , స్పూను తరిగిన అల్లం , అయిదు తరిగిన పచ్చిమిర్చి , స్పూను జీలకర్ర , మూడు రెమ్మలు తరిగిన కరివేపాకు , రెండు తరిగిన ఉల్లి పాయల ముక్కలు మరియు సరిపడా ఉప్పు అన్నీ ఈ పిండిలో వేసి బాగా కలుపు కోవాలి .
స్టౌ మీద బాండీ పెట్టి 200 గ్రాముల నూనె వేసి నూనె బాగా కాగగానే గారెలు మాదిరిగా వేసుకోవాలి .
అంతే వేడి వేడి రుచికరమైన తోటకూర గారెలు సర్వింగ్ కు సిద్ధం .
అల్లం చట్నీతో తింటే రుచిగా ఉంటుంది .
0 comments:
Post a Comment