పిడత కింద పప్పు
ఆలూరి కృష్ణ ప్రసాద్
ముంత కింద పప్పు / పిడత కింద పప్పు / మసాలా పప్పు / గరం గరం / ఇంట్లోనే తయారు చేసుకునే విధానము.
నేను మీకు ఫోటోలో కాఫీ/ టీ తాగే కప్పు కొలత ఇచ్చాను .
ఆ కప్పుకు మధ్యలో గీత కూడా ఉంది .
అందువలన షుమారుగా ఆ విధంగానే ఫాలో అవ్వండి.
నేను చూపిన కప్పులో గీత వరకు నాటు అటుకులు కాని లేదా మిషను అటుకులు కాని తీసుకోండి .
స్టౌ మీద బాండి పెట్టి అందులో ఒక కప్పు నూనె పోసి నూనె సలసలా కాగాక ఒక్కసారి అర కప్పు అటుకులు వేసి తెల్ల రంగులో వేగగానే తీసేసి ఒక ప్లేటులో పక్కన పెట్టుకోండి .
అర కప్పు అటుకులు వేగాక కప్పుడు అటుకులు అవుతాయి.
రెండు పెద్ద ఉల్లిపాయలు చాలా సన్నగా ముక్కలు తరిగి వేరే ప్లేటులో ఉంచుకోండి.
మూడు పచ్చి మిర్చి సన్నగా తరిగి ఉంచుకోండి.
రెండు రెమ్మలు కరివేపాకు సన్నగా తరిగి ఉంచుకోండి .
ఒక పావు కప్పు పొదినా ఆకు కూడా సన్నగా తరిగి ఉంచుకొండి.
వేయించి పొట్టు తీసిన వేరుశనగ గుళ్ళు పావు కప్పు , వేయించిన శనగపప్పు ( పుట్నాల పప్పు ) పావు కప్పు , కారం వేయని బూంది అర కప్పు సిద్ధంగా ఉంచుకోండి .
నిమ్మకాయ ఒకటి , గరం మసాల పొడి ఒక స్పూను , కారం ఒక స్పూను , ఉప్పు తగినంత సిద్ధం చేసుకోండి.
ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో వరుస క్రమంలో వేయించిన అటుకులు, వేరు శనగ పప్పు , వేయించిన శనగపప్పు , కారం వేయని బూందీ , సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు , సన్నగా తరిగిన కరివేపాకు , సన్నగా తరిగిన పొదీనా , సన్నగా తరిగిన పచ్చి మిర్చి , ఒక స్పూను గరం మసాలా పొడి , ఒక స్పూన్ కారం , ఒక కాయ పిండిన నిమ్మరసం , తగినంత ఉప్పు వేసి గరిటతో బాగా కలిపి ప్లేట్లలో పెట్టి సాయంత్రం పూట సర్వ్ చేసారా !!
ఇక దాని రుచి చెప్పడం చేసి రుచి చూసి మీరే అంటారు " అద్భుతం " అని.
0 comments:
Post a Comment