చారుపొడి తయారీ
ఆలూరి కృష్ణ ప్రసాద్
మా ఇంట్లో చారు పొడి నెలకు సరి పడా మిక్సీ వేసుకుంటాము .
చారుపొడి చేసుకునే విధానము .
ఎండు మిరపకాయలు --- షుమారు 20 గ్రాములు.
ధనియాలు ---- 50 గ్రాములు
జీలకర్ర ----- 15 గ్రాములు
మిరియాలు ---- 15 గ్రాములు
పచ్చి శనగపప్పు --- 25 గ్రాములు
కందిపప్పు ---- 20 గ్రాములు
షుమారుగా కొలతలు చెప్పాను.
ఇవి అన్నీ పచ్చివే ఒక చాటలో పోసి ఎర్రటి ఎండలో మూడు రోజులు ఎండ నివ్వండి .
మూడో రోజు ఈ పదార్ధాలన్నీ మెత్తగా మిక్సీ వేసుకోండి .
మేము ఇందులో కొంచెం పచ్చి ఇంగువ వేసుకుంటాం .
మీకు ఇష్ట మైతే పొడి మిక్సీ వేయబోయే ముందు ఇంగువ తగినంత వేసుకోండి.
మిరియాలు మరి కాస్త వేసుకుంటే ముక్కులు అదిరిపోయే ఘూటుతో చారుపొడి రెడీ అవుతుంది .
ఈ మిశ్రమాన్ని ఒక సీసాలో పోసి నిల్వ ఉంచుకోండి .
చారులో మీరు చెప్పిన విధంగానే చింతపండు , పచ్చిమిరపకాయలు , ఉప్పు , ఇష్టమైతే చాలా కొద్దిగా బెల్లం , కరివేపాకు , పసుపు వేసి నీళ్ళు పోసి బాగా తెర్లుతున్నప్పుడు ఈ చారుపొడి రెండు టీ స్పూన్లు వేసి పొంగ కుండా చూసుకుని, దింపే ముందు కొత్తిమీర వేసుకుని రెండు ఎండుమిరపకాయలు , ఆవాలు , జీలకర్ర , మెంతులు , ఇంగువ వేసి నూనెతో పోపు పెట్టుకోండి .
ఇంక రుచికరమైన చారు సిద్ధం.
0 comments:
Post a Comment