ఉల్లిపాయల పునుగులు
ఆలూరు కృష్ణప్రసాదు .
ఉల్లిపాయల పునుగులు .
తయారీ విధానము .
పావు కె. జి . మినప గుళ్ళు ముందు రోజు నీళ్ళలో నాన బెట్టుకొని మరుసటి రోజు నీళ్ళు వడగట్టుకొని గారెల పిండిలా గట్టిగా మెత్తగా వేసుకోవాలి .
మూడు ఉల్లిపాయలు ముక్కలుగా తరుగు కోవాలి .
పావు కప్పు కరివేపాకు తరుగు కోవాలి .
ఒక కట్ట కొత్తిమీర సన్నగా తరుగు కోవాలి .
ఆరు పచ్చిమిర్చి సన్నగా తరుగు కోవాలి .
చిన్న అల్లం ముక్క సన్నగా తరుగు కోవాలి .
ఆ పిండి ఒక గిన్నెలో వేసుకుని అందులో పావు స్పూను జీలకర్ర , తగినంత ఉప్పు , తరిగిన ఉల్లిపాయ ముక్కలు , తరిగిన కరివేపాకు , తరిగిన కొత్తిమీర , తరిగిన అల్లం ముక్కలు , ఒక పులుసు గరిటెడు గట్టి పెరుగు వేసి బాగా కలుపు కోవాలి .
ఓ గంట పాటు అలాగే ఉంచాలి .
ఆ తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి అర కె. జి . నూనె పోసి నూనె బాగా కాగగానే చేతితో పునుగుల్లా వేసుకుని బంగారు రంగు వచ్చే వరకు వేయించుకుని ప్లేటులో తీసుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ పునుగులు మధ్యాహ్న పలహారమునకు సిద్ధం.
అల్లం చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి .
0 comments:
Post a Comment