Thursday, June 1, 2017

ఉల్లిపాయలతో పప్పు పులుసు .

ఉల్లిపాయలతో పప్పు పులుసు .
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 

ఇందులో కంది పప్పు ఒక చిన్న గ్లాసు వేస్తాము. ( 100 గ్రాములు )
నాలుగు ఉల్లిపాయలు నాలుగు పక్షాలు చేసి ఉంచు కోవాలి.
ముందుగా గిన్నెలో నూనె వేసి ఎండుమిర్చి, మినపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర , ఇంగువ పోపు వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు , పచ్చిమిర్చి ముక్కలు వేసి రెండునిమిషాల పాటు వేయించి , తర్వాత చింతపండు రసంపోసి ఉడకనిస్తాము.
తగినంత ఉప్పు, అర స్పూను కారం, కరివేపాకు మాత్రమే వేస్తాము.
ఇష్టమైన వారు కొద్దిగా బెల్లం వేసుకోవచ్చు .
ఉడికేటప్పడు పప్పుకూడ వేస్తాము.
మెంతులు, కరివేపాకు తప్పకుండా వేయాలి.
చివరగా దించే ముందు కొత్తిమీర వేసుకుంటే రుచి అమోఘం.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి