పూరీలు ఉల్లిపాయ కూరతో.
ఆలూరుకృష్ణప్రసాదు .
పూరీలు ఉల్లిపాయ కూరతో. ( బంగాళా దుంప వేయకుండా )
సింపుల్ గా ఉల్లిపాయ కూర తయారీ విధానము .
నాలుగు పెద్ద ఉల్లిపాయులు ముక్కలుగా తరుగుకోండి.
స్టౌ మీద బాండి పెట్టి నాలుగు స్పూన్ల నూనె వేసి , నూనె బాగా కాగాక మూడు ఎండు మిర్చి ముక్కలు , చాయమినపప్పు స్పూను , పచ్చి శనగపప్పు స్పూను , కొద్దిగా జీలకర్ర , ఆవాలు అరస్పూను , మూడు పచ్చిమిరపకాయల ముక్కలు , రెండు రెమ్మలు కరివేపాకు వేసి పోపు వేసి , పోపు వేగాక తరిగి ఉంచుకున్న ఉల్లిపాయల ముక్కలు , కొద్దిగా పసుపు , తగినంత ఉప్పు వేసి బాగా మగ్గ నివ్వాలి.
తర్వాత ఒక అరగ్లాసు నీళ్ళలో స్పూను శనగపిండి వేసి బాగా కలిపి ఆ నీళ్ళు కూరలో పోసి దింపేయాలి .
అంతే వేడి వేడి పూరీల లోకి వేడి వేడి కూర సర్వింగ్ కు సిద్ధం .
0 comments:
Post a Comment