వంకాయ , మామిడి కాయ , పచ్చి కొబ్బరి పచ్చడి
ఆలూరుకృష్ణప్రసాదు .
ఈ రోజు మీకు వంకాయ , మామిడి కాయ , పచ్చి కొబ్బరి పచ్చడి గురించి తెలియ చేస్తాను .
కావలసినవి ---
గుండ్రని వంకాయలు -- రెండు
పుల్లని పచ్చి మామిడికాయ --
పై చెక్కు తీసి ముక్కలుగా తరిగినవి ఒక కప్పు .
పచ్చి కొబ్బరి కోరు -- అర కప్పు
కరివేపాకు -- మూడు రెమ్మలు
కొత్తిమీర -- ఒక కట్ట
పచ్చి మిర్చి - 4
పసుపు -- కొద్దిగా .
పుల్లని పచ్చి మామిడికాయ --
పై చెక్కు తీసి ముక్కలుగా తరిగినవి ఒక కప్పు .
పచ్చి కొబ్బరి కోరు -- అర కప్పు
కరివేపాకు -- మూడు రెమ్మలు
కొత్తిమీర -- ఒక కట్ట
పచ్చి మిర్చి - 4
పసుపు -- కొద్దిగా .
పోపు నకు ---
ఎండు మిరపకాయలు -- ఆరు
ఆవాలు --- ఒక స్పూను
మినపప్పు -- రెండు స్పూన్లు
ఇంగువ -- కొద్దిగా
నూనె --- రెండు స్పూన్లు
ఉప్పు -- తగినంత .
ఆవాలు --- ఒక స్పూను
మినపప్పు -- రెండు స్పూన్లు
ఇంగువ -- కొద్దిగా
నూనె --- రెండు స్పూన్లు
ఉప్పు -- తగినంత .
తయారు చేయు విధానము --
ముందుగా వంకాయలు తడి లేకుండా తుడుచుకుని కాయ పైన కొద్దిగా నూనె రాసుకుని స్టౌ మీద సన్నని మంటలో కాల్చి పై తొక్కు తీసుకోవాలి .
స్టౌ మీద బాండి పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి నూనె కాగాక ఎండు మిర్చి మినపప్పు ఆవాలు జీలకర్ర ఇంగువ కరివేపాకు వేసి పోపు వేయించుకోవాలి .
పోపు చల్లారగానే మిక్సీలో ఎండు మిరపకాయలు , పసుపు , ఉప్పు వేసి తిప్పుకోవాలి .
తర్వాత మామిడి కాయ ముక్కలు పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి తురుము వేసి మరి పేస్ట్ లా కాకుండా మిక్సిలో వేసుకోవాలి .
చివరగా స్టౌ మీద కాల్చి పై తొక్క తొడిమ తీసిన వంకాయలు . కొత్తిమీర , మిగిలిన పోపు అంతా వేసి ఒకసారి తిప్పుకొని వేరే గిన్నెలో తీసుకోవాలి .
అంతే కరివేపాకు , కొత్తిమీర , మరియు ఇంగువ సువాసనలతో ఘమ ఘమ లాడుతున్న వంకాయ , మామిడి కాయ , పచ్చి కొబ్బరి కలిపిన పచ్చడి సర్వింగ్ కు సిద్ధం.
ఈ పచ్చడి అన్నంలోకి , మరియు చపాతీల లోకి కూడా బాగుంటుంది .
0 comments:
Post a Comment