టమోటో బాత్
ఆలూరు కృష్ణప్రసాదు .
వేడి వేడి జీడిపప్పు టమోటో బాత్ కొబ్బరి చట్నీ మరియు అల్లం చట్నీతో .
తయారీ విధానము .
పోపు అంతా ఉప్మా లాగా బాండీలో నాలుగు స్పూన్లు నూనె వేసి కాగగానే ఎండుమిర్చి శనగపప్పు మినపప్పు ఆవాలు కరివేపాకు వేసి పోపు వేగగానే మూడు తరిగిన పచ్చిమిర్చి , రెండు టమోటాలు , రెండు ఉల్లిపాయలు ముక్కలు తరిగి పోపులోనే మగ్గపెట్టి , గ్లాసు బొంబాయిరవ్వకు రెండు గ్లాసుల నీళ్ళు పోసి , సరిపడా ఉప్పువేసి , నీళ్ళు బాగా తెర్లుతున్నప్పుడు ఈ రవ్వ పోసి , అట్ల కాడతో బాగా కదిపి మూత పెట్టాలి .
నాలుగు లవంగాలు , రెండు యాలకులు , దాసిన చెక్క , మూడు మిరియాలు అమాన్ దస్తాలో వేసి మెత్తగా దంచుకుని ఆ పొడిని ఈ బాత్ లో వేసి , మూడు స్పూన్లు నెయ్యి వేసి మరో మూడు నిముషాలు ఉంచి దింపుకోవాలి .
పైన నేతిలో వేయించిన జీడిపప్పు తో అలంకరించుకోవాలి .
0 comments:
Post a Comment