Thursday, June 1, 2017

మామిడి కాయ - ఆనపకాయ అంటు పులుసు .

మామిడి కాయ - ఆనపకాయ అంటు పులుసు .
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 

కావలసినవి .
పుల్లని మామిడి కాయ పెద్దది -- ఒకటి
ఆనపకాయ / సొరకాయ --
కాయలో సగం ముక్క
దోసకాయ -- ఒకటి
ములక్కాడలు లేతవి --- రెండు 
వంకాయలు --- 2
పచ్చి మిర్చి --- 5
కరవేపాకు -- మూడు రెబ్బలు
కొత్తిమీర --- ఒక కట్ట 
పసుపు --- కొద్దిగా 
ఉప్పు --- తగినంత 
బెల్లం -- చిన్న ముక్క
బియ్యపు పిండి -- స్పూనున్నర 
కారం --- అర స్పూను .

పోపుకు .
నూనె --- రెండుస్పూన్లు 
ఎండుమిరపకాయలు -- 3
మెంతులు --- కొద్దిగా 
జీలకర్ర --- పావు స్పూను 
ఆవాలు -- అర స్పూను 
ఇంగువ -- కొద్దిగా

తయారీ విధానము .
మామిడి కాయ పై చెక్కు తీసి మాగాయ ముక్కలు తరిగి నట్లుగా తరుగు కోవాలి .
అనపకాయ / సొరకాయ పై చెక్కు తీసి ముక్కలుగా తరుగు కోవాలి.
అదే విధంగానే దోసకాయ కూడా పై చెక్కు తీసి గింజలను తీసి చేదు చూసుకుని ముక్కలుగా తరుగు కోవాలి.
ములక్కాడలు పొడవుగా ముక్కలుగా తరుగు కోవాలి .
పచ్చిమిర్చి నిలువుగా చీలికలు గా తరగాలి .
ఒక గిన్నెలో ఈ తరిగిన ముక్కలన్నీ వేసి ఒక రెండు గ్లాసుల నీళ్ళు పోయాలి .
వంకాయలు కూడా ముక్కలుగా తరిగి వేయాలి.
అందులో పసుపు , ఉప్పు , కారం బెల్లం వెయ్యాలి .
పచ్చిమిర్చి , కరివేపాకు కూడా వెయ్యాలి .
ఇప్పుడు స్టౌ వెలిగించి ఈ పులుసు గిన్నె పెట్టి మీడియం సెగన ముక్కలన్నీ ఉడికి దగ్గర పడేలా ఉడకనివ్వాలి .
తర్వాత ఒక అర గ్లాసు నీళ్ళలో ఒకటిన్నర స్పూను బియ్యపు పిండి వేసి చేత్తో బాగా కలిపి మరుగుతున్న పులుసు లో పోయాలి .
మరో మూడు నిముషముల తర్వాత పులుసు చిక్క పడగానే దింపుకోవాలి .
తర్వాత స్టౌ మీద పోపు గరిట పెట్టుకుని రెండు స్పూన్లు నూనె వేసి నూనె కాగగానే ఎండుమిర్చి , మెంతులు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ వేసి పోపు పెట్టు కోవాలి .
పైన తరిగిన కొత్తిమీర వేసుకోవాలి .
అంతే ఘమ ఘమ లాడే ఇంగువ పోపుతో మామిడి కాయ ఆనప కాయ ములక్కాడ అంటు పులుసు సర్వింగ్ కు సిద్ధం.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి