పొదీనా చింతచిగురు పచ్చడి
ఆలూరు కృష్ణప్రసాదు .
పొదీనా చింత చిగురు పచ్చడి .
కావలసినవి .
పొదీనా -- రెండు కట్టలు విడదిసి ఆకులు వలుచుకుని సిద్ధంగా ఉంచుకోవాలి.
చింత చిగురు -- 150 గ్రాములు .
ఆకు పుల్లలు లేకుండా ఏరుకుని ఆకును చేతితో మెత్తగా నలుపుకోవాలి .
ఎండుమిరపకాయలు -- 12
నూనె --- 75 గ్రాములు
పచ్చి శనగపప్పు -- రెండు స్పూన్లు
పచ్చి మిర్చి -- 4
పసుపు -- కొద్దిగా
ఉప్పు -- తగినంత
పోపునకు .
ఎండుమిర్చి -- 3
జీలకర్ర -- పావు స్పూను
మెంతులు -- పావు స్పూను ఆవాలు -- అర స్పూను
ఇంగువ -- కొద్దిగా
తయారు చేయువిధానము .
ముందుగా స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే 12 ఎండుమిరపకాయలు మరియు పచ్చి శనగపప్పు వేసి బాగా వేగనిచ్చి వేరే ప్లేటులో పెట్టు కోవాలి .
అదే నూనెలో ముందుగా పొదీనా , ఆ తర్వాత చేతితో నలిపిన చింత చిగురు , కాస్త పసుపు , పచ్చిమిర్చి వేసి బాగా మగ్గనిచ్చి తీసి వేరే ప్లేటులో పెట్టుకోవాలి .
ఇప్పుడు మళ్ళీ స్టౌ మీద బాండి పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి వరుసగా ఎండుమిర్చి , మెంతులు , జీలకర్ర , ఆవాలు మరియు ఇంగువ వేసి పోపు వేయించు కోవాలి .
ఇప్పుడు మిక్సీలో ఎండుమిరపకాయలు , పచ్చి శనగపప్పు , పసుపు , తగినంత ఉప్పు వేసి కాస్త మెత్తగా మిక్సీ వేసుకోవాలి ,
ఆ తర్వాత అందులో వేయించుకున్న పొదినా చింత చిగురు , పచ్చి మిరపకాయలు వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
చివరగా వేయించుకున్న పోపు కూడా అందులో వేసి మరోసారి మిక్సీ వేసుకోవాలి .
తర్వాత వేరే గిన్నెలో కి తీసుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే పొదినా చింతచిగురు పచ్చడి దోశెలలోకి మరియు భోజనము లోకి సిద్ధం .
చింత చిగురు లో పులుపు ఉంటుంది కనుక వేరుగా చింతపండు రసం వేయనవసరం లేదు .
0 comments:
Post a Comment