ఉల్లిపాయ టమోటో నువ్వుపప్పు పచ్చడి .
ఆలూరి కృష్ణ ప్రసాద్
ఇడ్లీ దోశెలు మరియు అన్నం లోకి
తయారి విధానము .
ముందుగా నిమ్మకాయంత చింతపండు పదిహేను నిముషములు నీటిలో నాన బెట్టి చిక్కగా రసం తీసుకోవాలి .
స్టౌ మీద బాండీ పెట్టి ఒక 50 గ్రాముల నువ్వు పప్పు , నూనె లేకుండా వేయించుకుని మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి .
రెండు ఉల్లిపాయలు ముక్కలుగా తరుగు కోవాలి .
రెండు టమోటో లు ముక్కలుగా తరుగు కోవాలి .
ఎనిమిది పచ్చి మిరపకాయలు తొడిమలు తీసి ఉంచు కోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి నాలుగు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే ఒక ఆరు ఎండుమిరపకాయలు వేసి వేగాక తీసి పక్కన పెట్టు కోవాలి .
ఇప్పుడు అదే బాండీలో ఉల్లిపాయ ముక్కలు , టమోటా ముక్కలు , పచ్చిమిర్చి , తగినంత ఉప్పు , చింతపండు రసం , కొద్దిగా పసుపు వేసి మూత పెట్టి బాగా మగ్గ నివ్వాలి.
చల్లారగానే ముందు మిక్సీలో ఎండుమిరపకాయలు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి .
తర్వాత అందులోనే మగ్గిన ముక్కలు వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
తర్వాత అందులో నువ్వులపొడి వేసి మరో సారి మిక్సీ వేసి వేరే bowl లోకి తీసుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద పోపు గరిట పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి రెండు ఎండుమిరపకాయలు , మినపప్పు , ఆవాలు , ఇంగువ , కరివేపాకు తో పోపు పెట్టుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ టమోటో నువ్వుపప్పు చట్నీ ఇడ్లీ , దోశె మరియు అన్నం లోకి సిద్ధం.
0 comments:
Post a Comment