Tuesday, June 6, 2017

పానిపూరి

పానిపూరి 
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 


కావాల్సిన పదార్ధాలు ;-

 బొంబాయిరవ్వ -- ముప్పావు కప్పు
మైదాపిండి -- పావు కప్పు
ఉప్పు -- పావు టీ స్పూన్
పొదిన -- ఒక కట్ట
మిరియాలు - 4 గింజలు
చింతపండు -- నిమ్మకాయంత సైజులో తీసుకోవాలి
పచ్చిమిరపకాయలు - 6
నల్ల నువ్వులు -- ఒక టీ స్పూన్
అల్లం -- అంగుళం ముక్క
జీలకర్ర -- ఒక టీ స్పూన్
నూనె -- పావు కేజీ 

తయారుచేసే విధానం ;-

ముందుగ ఒక గిన్నె తీసుకుని అందులో బొంబాయిరవ్వ ,మైదాపిండి వేసి పావు టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి నీళ్ళు పోసి చపాతీ పిండిలాగా కలపాలి . తరవాత ఆ పిండి మీద బట్టను కప్పి 10 నిముషాలు వదిలేయాలి . ఇప్పుడు పొదిన ఆకులు ,మిరియాలు ,జీలకర్ర ,నల్ల నువ్వులు ,చింతపండు ,ఒక టీ స్పూన్ ఉప్పు ,పచ్చిమిరపకాయలు గ్రైన్దర్ గిన్నెలో వేసి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తటి పేస్టు లాగా రుబ్బుకోవాలి ... ఒక గిన్నె తీసుకుని రుబ్బిన పేస్టు ను  వడకట్టే చట్రంలో వేసి గిన్నెలో పెట్టి నీళ్ళు పోయాలి . అప్పుడు రసం గిన్నెలోకి దిగుతుంది . ఇలా రెండు మూడు సార్లు చెయ్యాలి . ఇప్పుడు పాని రెడీ అయ్యింది ,. ఇక ఇప్పుడు  ఇందాక మనము కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకుని దాని మీద బట్ట కప్పి ఉంచాలి . తరవాత ఒక తడి బట్టను పరిచి వుంచి ఈ ఉండలను చపాతిల కర్రతో రౌండ్ గ వత్తుకోవాలి . మొత్తం అన్ని ఉండలను వట్టి పెట్టుకుని  పూరీలు ఆరిపోకుండా ఉండటానికి వాటిపైన బట్ట కప్పి వుంచి ఒక బాండి తీసుకుని నూనె పోసి స్టవ్ మీద పెట్టి సన్నటి సెగ మీద పూరి లను వేయించాలి .  ఆలు +బఠానీ +టమాట  కూర చేసి ఒక ప్లేటులో పూరీలు ,కూర ,చిన్న గిన్నెలో పాని పోసి అందించటమే అతిధులకు .... అంతే ఘుమఘుమ లాడే పానిపూరి రెడీ ...........

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి