గోబి ( కాలీ ఫ్లవర్ ) పకోడి .
ఆలూరు కృష్ణప్రసాదు .
కావలసినవి .
సన్నగా తరిగిన కాలిఫ్లవర్ ముక్కలు --- ఒక కప్పు .
శనగపిండి -- ఒక కప్పు
బియ్యపు పిండి -- రెండు స్పూన్లు .
అల్లం తరుగు -- స్పూను
పచ్చిమిర్చి ముక్కలు -- ఆరు పచ్చిమిర్చి సన్నగా ముక్కలుగా తరుగు కోవాలి .
జీలకర్ర -- అర స్పూను
కారం --- స్పూను
ఉప్పు --- తగినంత
నూనె -- 200 గ్రా ములు .
తయారీ విధానము .
కాలిఫ్లవర్ ఫోటోలో చూపిన విధముగా తుంపుకుని సన్నని ముక్కలుగా తరుగు కోవాలి .
ఒక గిన్నెలో తరిగిన గోబి ముక్కలు , శనగపిండి , బియ్యపు పిండి , పచ్చిమిర్చి ముక్కలు , అల్లం తరుగు , జీలకర్ర , కారం , తగినంత ఉప్పును వేసి సరిపడా నీళ్ళు పోసుకుంటూ పిండిని గట్టిగా కలుపు కోవాలి .
తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి మొత్తము నూనె పోసి నూనె బాగా కాగగానే పిండిని పకోడీల లాగా వేసుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే మధ్యాహ్నము అల్పాహారము గా గోబి పకోడి సిద్ధం .
0 comments:
Post a Comment