Saturday, June 10, 2017

పెళ్ళి దొండకాయ కూర

పెళ్ళి దొండకాయ కూర
ఆలూరుకృష్ణప్రసాదు .

ఒక  పెళ్ళి  విందులో  దొండకాయ  fry  ఈ  విధంగా   చేసారు .
దొండకాయలు  ముక్కలుగా   తరిగారు .
పెద్ద  బాండి  పెట్టారు .
బాండీ  నిండా  నూనె పోసి  పూరీలు  వేయబోయే  ముందు  నూనె    కాచిన  మాదిరిగా  సలసలా కాచారు .
Stove  Sim  చేసి  ముక్కలు  మూడు  విడతలుగా  పోసి  బూంది  గరిటతో  కదుపుతూ  ఎర్రగా   వేగనిచ్చి  వేరే  పెద్ద  బేసిన్  లోకి  తీసారు .
ఓ  150  గ్రాములు  జీడిపప్పు   చిన్న ముక్కలుగా   చేసారు .
బియ్యపు  పిండిలో ( ఒక కప్పు   బియ్యపు  పిండికి  పావు కప్పు  శనగపిండి ) చొప్పున  శనగపిండి   తగినంత   ఉప్పు , కొద్ది  కారం మరియు  జీడిపప్పు   పలుకులు  తగినన్ని   నీళ్ళు పోసి  కలిపి   చిన్న  చిన్న  పకోడీలు   ఇందాక  ముక్కలు  వేయించిన  నూనె  బాండిలోనే   వేయించారు .
మళ్ళీ  Stove  మీద  పెద్ద  బాండీ  పెట్టి  కొద్దిగా   నూనె  పోసి  వేయించిన  దొండకాయ  ముక్కలు  ,  జీడిపప్పు   పకోడీలు  , తగినంత   ఉప్పు , కారం మరియు కొద్దిగా  పల్లీల  పొడి  వేసి  బాగా  కలిపి  దింపి  
సర్వింగ్   స్టీల్  కంటైనర్స్ లో  పెట్టి ,
పైన  ఓ  100 గ్రాముల  జీడిపప్పు  మరియు  కరివేపాకు   నేతిలో  వేయించి  పైన  Decorate  చేసారు .

అంతే  Continental , Star  Hotels  దొండకాయ  fry  రెడీ .
ఫోటో   ---  ఈ రోజు  ఇంటిలో  చేసాము  .
                 చాలా  బాగా  కుదిరింది .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి