బీర చెక్కు పచ్చడి .
ఆలూరి కృష్ణ ప్రసాద్
కావల్సిన పదార్థములు
బీర చెక్కు
ఎండు మిరపకాయలు --- 3
పచ్చిమిరపకాయలు --- 3
మెంతులు --- కొద్దిగా
జీలకర్ర ---- పావు స్పూను
చాయ మినపప్పు --- స్పూన్
ఆవాలు ---- అర స్పూను
ఇంగువ ---- కొద్దిగా
పసుపు --- కొద్దిగా
చింతపండు --- తగినంత
ఉప్పు --- తగినంత
కరివేపాకు --- రెండు రెమ్మలు
కొత్తిమీర --- తగినంత
నూనె --- మూడు స్పూనులు
ముందుగా స్టౌ వెలిగించి బాండీ పెట్టి మూడు స్పూన్ల నూనె వేసి నూనె బాగా కాగాక చాయ మినపప్పు , జీలకర్ర , ఎండు మిరపకాయలు , ఆవాలు , ఇంగువా వేసి పోపు వేగాక పచ్చిమిరపకాయలు , బీరతొక్కు పసుపు వేసి అయిదు నిముషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వండి.
బీర చెక్కు మగ్గాక దింపేయండి .
ఇప్పుడు మిక్సీలో చింతపండు ఉప్పు వేసి నలిగాక ఈ మగ్గిన బీర తొక్కును వేసి మ రోసారి తిప్పి పచ్చడి నలిగాక మిగిలిన పోపు కొత్తిమీర కూడా అందులో వేసుకుని పేస్టులా కాకుండా ఓ మాదిరి మెత్తగా వేసుకొని ఓ Bowl లోకి తీసుకోండి.
అంతే బీర చెక్కు పచ్చడి భోజనం లోకి సిద్ధం.
లేత చెక్కు అయితేనే పచ్చడి చేసుకోండి.
లేకపోతే పచ్చడి రుచి ఉండదు .
0 comments:
Post a Comment