దోసకాయ ముక్కల పచ్చడి .
ఆలూరి కృష్ణ ప్రసాద్
కావలసినవి .
పసుపు పచ్చగా బాగా గట్టిగా
ఉన్న దోసకాయ -- 1
పచ్చిమిరపకాయలు - 6
కొత్తిమీర కొంచెము ఎక్కువగా -
ఒక కట్ట .
చింతపండు -- నిమ్మకాయంత
పసుపు - కొద్దిగా
ఉప్పు -- తగినంత
పోపు సామానుకు కావలసినవి .
నూనె -- నాలుగు స్పూన్లు
ఎండు మిరపకాయలు -- 5
చాయమినపప్పు - ఒకటిన్నర స్పూను .
జీలకర్ర -- పావు స్పూను
ఆవాలు -- అరస్పూను
మెంతులు --- పావు స్పూను
ఇంగువ -- కొద్దిగా
ముందుగా దోసకాయ పై చెక్కు తీసి చేదు ఉందో లేదో చూసుకుని సగం పైగా గింజలను తీసి వేసి సన్నగా ముక్కలు తరుగుకొని వేరే ప్లేటు లో ఉంచుకోవాలి .
దోస ముక్కల పై పసుపు వేసుకోవాలి.
పది నిముషాలు చింతపండు నాన బెట్టి చిక్కగా రసం తీసుకుని వేరే ఉంచుకోవాలి .
ఇప్పుడు స్టౌ వెలిగించి బాండి పెట్టి , రెండు స్పూన్లు నూనె వేసి ముందుగా ఎండుమిరపకాయలు , మెంతులు వేయించుకొని వేరే పెట్టుకోవాలి .
తర్వాత అదే బాండిలో మరో రెండు స్పూన్లు నూనె వేసి చాయమినపప్పు , జీలకర్ర , ఆవాలు , కరివేపాకు మరియు ఇంగువ వేసుకుని పోపు వేయించుకుని పక్కన ఉంచుకోవాలి.
ఇప్పుడు మిక్సీలో వేరేగా ఉంచుకున్న ఎండుమిరపకాయలు , మెంతులు
తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి .
తర్వాత పచ్చి మిర్చి ముక్కలు , చింతపండు రసం , దోసకాయ ముక్కలు వేసి ఒక్కసారి ముక్కలు నలిగి పోకుండా తిప్పుకోవాలి .
చివరగా కొత్తిమీర , మిగిలిన పోపు కూడా మరోసారి తిప్పు కోవాలి .
ముక్కలు ముక్కలుగా ఉంటేనే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది .
అందుకని పేస్ట్ లా వేసుకోకండి .
చింతపండు బదులుగా ఇదే విధంగా కొత్త చింతకాయ తొక్కు కలిపితే పచ్చడి రుచి అద్భుతంగా ఉంటుంది .
ఈ పచ్చడి ప్రిజ్ లో ఉంచుకుంటే నాలుగు రోజులు ఫ్రెష్ గా ఉంటుంది.
విన్నపం ; --
మేం వెల్లుల్లి వాడం కాబట్టి నా రెసిపీ లన్నీ వెల్లుల్లి లేకుండానే ఉంటాయి .
వెల్లుల్లి ఇష్ట పడేవారు ఇంగువ బదులుగా వెల్లుల్లి వేసుకోవచ్చు .
0 comments:
Post a Comment