Wednesday, June 14, 2017

శనగపిండి తీపి పచ్చడి


శనగపిండి తీపి పచ్చడి
ఆలూరి కృష్ణ ప్రసాద్ 


ప్రియమిత్రులారా  !
మీరు  వేడి  వేడి  ఇడ్లీలలో  శనగ పిండి  తీపి  పచ్చడి  ఎప్పుడైనా  తిన్నారా  ?
ఈ  పచ్చడి  అందరికీ   నచ్చక  పోయినా  తప్పకుండా   పిల్లలకు మరియు  కొంతమంది  పెద్దలకు   నచ్చి తీరుతుంది .
మరి  ఈ  శనగపిండి  తీపి  పచ్చడి 
తయారీ  విధానము  గురించి  తెలుసుకుందామా !
శనగ పిండి తీపి  పచ్చడి .
కావలసినవి .
శనగపిండి    ---   ఒక  గరిటెడు.
 పంచదార    ---   రెండు  లేదా మూడు  స్పూన్లు.
నెయ్యి  --   రెండు  స్పూన్లు 
చింతపండు  ---  రెండు  రెబ్బలు. లేదా  చిన్న ఉసిరి కాయంత.
ఉప్పు  ---   చాలా  కొద్దిగా 
పచ్చి మిర్చి  ---  రెండు . చిన్న  ముక్కలుగా  కట్  చేసుకోవాలి .
తాలింపుకు  కావలసినవి .
ఎండుమిరపకాయలు --  రెండు  చిన్న ముక్కలుగా  తుంపు కోవాలి.
పచ్చి శనగపప్పు  --  స్పూను .
చాయమినపప్పు  --   స్పూను 
ఆవాలు  ---  పావు  స్పూను 
కరివేపాకు  --  రెండు  రెమ్మలు  . తుంపి  ఆకులు  పోపుకు  తీసి  పెట్టు కోవాలి.
(  ఇందులో  మెంతులు ,  జీలకర్ర  , ధనియాలు , ఇంగువ  వంటివి  వెయ్యకూడదు . )
శనగ పిండి  తీపి  పచ్చడి  తయారీ  విధానము .
ముందుగా  ఒక  గ్లాసు  నీళ్ళలో  చింతపండు  వేసి  పల్చగా   రసం తీసి  వేరేగా  ఒక  గిన్నెలో  పెట్టుకోండి .
చింతపండు   పిప్పి  పారేయండి .
ఇప్పుడు  ఆ గిన్నెలో  తరిగి ఉంచుకున్న  పచ్చి మిర్చి ముక్కలు  వేయండి .
అందులో  చాలా  కొద్దిగా  ఉప్పు  వేయండి . పావు స్పూను  లో  సగం  సరిపోతుంది . చాలకపోతే  చివరగా  రుచి  చూసి  వేసుకోవచ్చు .
ఇప్పుడు  స్టౌ  వెలిగించి   బాండి  పెట్టి రెండు  స్పూన్లు   నెయ్యి  వేసి  అందులో శనగ  పిండి  వేసి  కమ్మని  వేగిన వాసన  వచ్చేదాకా   వేయించుకోండి.  పచ్చి  వాసన  పోవాలి .
ఇప్పుడు  ఆ  వేగిన  శనగపిండి ముందుగా   సిద్ధం  చేసుకున్న  ఈ  చింతపండు   నీళ్ళలో   వేసి ,  ఇందులో  పంచదార  కూడా  వేసి  గరిటతో  బాగా  కలుపుకోండి .
మళ్ళీ  స్టౌ   మీద  బాండి   పెట్టి  రెండు  స్పూన్లు   నెయ్యి వేసి  ఎండు  మిర్చి  ముక్కలు ,  పచ్చి శనగపప్పు ,  చాయమినపప్పు , ఆవాలు , కరివేపాకు   వేసి   పోపు  వేగగానే  ఈ  పచ్చడి లో  కలుపుకోండి.
అంతే .  ఎంతో  రుచిగా  ఉండే  శనగపిండి  తీపి  పచ్చడి  వేడి  వేడి  ఇడ్లీలలోకి  సిద్ధం.
ఈ  ప్రయోగం   నేరుగా  మీ  శ్రీవారి  మీద  కాకుండా  ముందు  పిల్లలకు  పెట్టి  వారికి  నచ్చితే  ముందడుగు  వేయండి.
ఈ  పచ్చడి  మా  అన్నదమ్ముల  కోసం  ఇడ్లీలలోకి  మా  అమ్మ చేసి పెట్టేది.
ఆ  రోజుల్లో  ఈ పచ్చడి  కోసం  అన్నదమ్ములము  పోటి  పడేవాళ్ళం.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి