ఉల్లిపాయ శనగపప్పు మసాలా వడలు
ఆలూరు కృష్ణప్రసాదు .
ఉల్లిపాయ శనగపప్పు మసాలా వడలు .
తయారీ విధానము .
ముందుగా పావు కిలో పచ్చి శనగపప్పు నాలుగు గంటల పాటు తగినన్ని నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి .
తర్వాత నీళ్ళు వడకట్టి మిక్సీ లో కచ్చాపచ్చాగా నీళ్ళు పోయకుండా వేసుకోవాలి .
ఆ మిశ్రమాన్ని ఒక బేసిన్ లోకి తీసుకోవాలి .
రెండు పెద్ద ఉల్లిపాయలు సన్నగా ముక్కలుగా తరిగి అందులో కలపాలి .
అయిదు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా తరిగి అందులో కలపాలి .
పావు కప్పు కరివేపాకు , పావు కప్పు పొదీనా సన్నగా తరిగి అందులో కలపాలి .
అర స్పూను జీలకర్ర , స్పూను కారం , సరిపడా ఉప్పు , స్పూను తరిగిన అల్లం , సన్నగా తరిగిన కొత్తిమీర మరియు రెండు స్పూన్లు బియ్యపు పిండి వేసి సరిపడా నీళ్ళు పోసుకుని పిండిని వడల్లా వేసుకోవడానికి వీలుగా చేతితో బాగా కలుపు కోవాలి .
స్టౌ మీద బాండి పెట్టి పావు kg నూనె పోసి నూనె బాగా కాగగానే చేతితో వడల్లా వత్తుకుని నూనెలో వేసుకుని బాగా వేగనివ్వాలి .
అంతే వేడి వేడి పచ్చి శనగపప్పు ఉల్లిపాయ మసాలా వడలు టిఫిన్ గా సేవించడానికి సిద్ధం.
0 comments:
Post a Comment