Tuesday, June 6, 2017

బొంబాయి చట్నీ

బొంబాయి  చట్నీ
రఘునాధ రెడ్డి  

రఘునాధ రెడ్డి గారు  చెప్పిన బొంబాయి  చట్నీ  తయారు  చేయు  విధానము .

చాలా  కొంచెం చింతపండు(  అంటే  పెద్ద ఉసిరికాయ  అంత)  గ్లాసు  నీళ్ళలో  పది  నిముషాలు  నానబెట్టి  పల్చగా   రసం  తీసుకోవాలి .
అందులో  పులుసు  గరిటెడు  శనగపిండి వేసి  , చేతితో  ఉండలు  కట్ట కుండా  కలుపుకోవాలి.  తగినంత    ఉప్పు (  కొంచమే  పడుతుంది  )   అందులో  వేసుకోవాలి .

ఇప్పుడు  స్టౌ  మీద  బాండి  పెట్టి  మూడు  స్పూన్లు   నూనె  వేసి ,  నూనె  బాగా  కాగాక  రెండు  ఎండు  మిరపకాయలు   తుంచిన  ముక్కలు , స్పూను  పచ్చి శనగపప్పు  , స్పూను  చాయమినపప్పు , పావు  స్పూను ఆవాలు , మూడు  పచ్చి  మిరపకాయలు   తరిగిన   ముక్కలు  మరియు  రెండు  రెమ్మలు  కరివేపాకు   వేసి  పోపు  వేగాక ,  ముందుగా   చింతపండు   రసం లో  కలిపి ఉంచుకున్న   శనగపిండి  నీళ్ళు  పోయాలి .  శనగపిండి  , చింతపండు  రసంలో నీళ్ళు  తక్కువ  పోస్తే  చట్నీ  మరీ ముద్దలా  వస్తుంది .  మరీ  ఎక్కువ   పోస్తే  పచ్చడి  నీళ్ళలా  వస్తుంది. అందువలన  సరిపడ  నీళ్ళు  పోసుకోవాలి. 
అయిదు  నిముషాలు  ఉడికి  పచ్చడి  దగ్గర  పడ్డాక  దింపుకుని  వేరే  గిన్నెలోకి  తీసుకోవాలి .
అంతే  రుచిగా  ఉండే  బొంబాయి  చట్నీ , లేదా  శనగపిండి  చట్నీ   సిద్ధం .
ఈ  చట్నీ  ఇడ్లీ  మరియు  దోశెలలోకి  బాగుంటుంది .
ఈ  చట్నీ  వేడిగానే  తినాలి .
ఒక  రెండు గంటలు  దాటితే  taste  మారి  బాగుండదు . చపాతి  మరియు  పూరీలలోకి  అయితే  ఇదే  విధానము  లో   చేయాలి .

అయితే  మూడు  పెద్ద  ఉల్లిపాయలు   ముక్కలు గా  కట్  చేసుకుని  పోపులో  శనగపిండి  నీళ్ళు  పోయకముందే  ఉల్లిపాయలు   వేసి  , ఉల్లిపాయలు   మగ్గాక  శనగపిండి  నీళ్ళు  పోసి  ,  ఆ తర్వాత  దింపుకోవాలి .బంగాళాదుంప   వేసుకన్నా , వేయక పోయినా  పర్వాలేదు.

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి