టమోటో పచ్చడి
ఆలూరి కృష్ణ ప్రసాద్
పదిహేను
రోజుల వరకు Fresh గా ఉండి ఇడ్లీ దోశె మరియు అన్నం
లోకి ఉపయోగించే ' టమోటో పచ్చడి ' .
కావలసినవి .
పండిన
గట్టిగా ఉన్న టమోటాలు
---- అర కిలో లేదా ఆరు పెద్దవి .
చింతపండు ---
50 గ్రాములు
ఎండు కారం --
మూడుస్పూన్లు
పసుపు --
కొద్దిగా
ఉప్పు --
తగినంత
నూనె --
50 గ్రాములు
పోపుకు .
ఎండుమిరపకాయలు
పెద్దముక్కలుగా చేసుకోవాలి -- 4
మెంతులు --
అర స్పూను
ఆవాలు --
స్పూను
ఇంగువ --
మామూలు కన్నా మరి కాస్త ఎక్కువ వేసుకోవాలి
నూనె --
50 గ్రాములు .
తయారి
విధానము .
ముందుగా
టమోటాలు కడిగి శుభ్రంగా తుడుచుకుని పెద్ద
ముక్కలుగా తరుగు కోవాలి .చింతపండు
శుభ్రం చేసుకొని తడుపు కోవాలి .
తర్వాత స్టౌ
మీద బాండీ పెట్టి ఒక 50 గ్రాముల నూనె వేసి నూనె బాగా
కాగనివ్వాలి . నూనె కాగగానే
టమోటా ముక్కలు వేయాలి . అట్లకాడతో
కదుపుతుండాలి.
తర్వాత
తడిపి ఉంచుకున్న చింతపండు , మూడు స్పూన్లు ఎండు కారం , కొద్దిగా
పసుపు , తగినంత ఉప్పు వేసి బాగా కదుపుతూ అట్లకాడ తోనే ముక్కల్ని
స్టౌ మీదనే మెత్తగా చేస్తూ మగ్గనివ్వాలి .
ఇంక మిక్సీ
వేసే అవసరం లేదు. ముక్కలు
పులుపు , ఉప్పు కారం అన్నీ పీల్చుకొని మెత్తగా
అయి పోతాయి . పచ్చడి వేరే Bowl లోకి తీసుకోవాలి
.
ఇప్పుడు
స్టౌ మీద బాండీ పెట్టి 50 గ్రాముల నూనె పోసి , నూనె బాగా కాగగానే
ముందు మెంతులు వేసి వేగాక ఎండు మిర్చి , ఆవాలు , ఇంగువ వేసి
వేడి వేడి పోపు పచ్చడిలో వేసి పెద్ద
స్పూను తో బాగా కలుపు కోవాలి .
ఆ తర్వాత
చిన్న జాడీలో పెట్టుకుంటే తాజాగా ఈ టమోటో
పచ్చడి పదిహేను రోజుల పాటు నిల్వ ఉంటుంది .
0 comments:
Post a Comment