Showing posts with label పెరుగు పచ్చడి. Show all posts
Showing posts with label పెరుగు పచ్చడి. Show all posts

Monday, July 9, 2018

అవియళ్

ఆలూరుకృష్ణప్రసాదు .

అవియళ్ .

అవియళ్  కేరళ వారి వంటకం.

ఇందులో అన్ని కూరగాయ ముక్కలు వేసుకుంటారు  కావున  చాలా  బలవర్ధకమైన  వంటకము  అవియళ్.

కేరళ ప్రాంతంలో  వారు  అన్ని వంటలకు  కొబ్బరి  నూనెను వాడతారు .

అందువల్ల వారు ఈ అవియళ్ లో కూడా కొబ్బరి నూనె నే వాడతారు .

నిజానికి  మనం కూడా కొబ్బరి  నూనె  వాడితేనే  మంచిది.

ఒకవేళ  కొబ్బరి  నూనె  వేసుకోవడం ఇష్టం లేకపోతే  నూనె  వాడకండి .

దాని బదులుగా  నెయ్యి వాడండి.

ఇంక ఈ అవియళ్ కు కావలసిన వస్తువులు మరియు తయారు  చేయు విధానము గురించి  తెలుసుకుందాము.

కావలసినవి .

బూడిద గుమ్మడికాయ  -- ఒక ముక్క .( పై చెక్కు తీసుకొని  ముక్కలుగా తరుగు కోవాలి . )

బంగాళా దుంపలు  --  రెండు.(  పై చెక్కు తీసి  ముక్కలుగా  చేసుకోవాలి )

క్యారెట్  --  రెండు . (  పై చెక్కు  తీసుకుని  ముక్కలుగా  తరుగు కోవాలి . )

బీన్స్  --   50  గ్రాములు .  ( చిన్న ముక్కలుగా  కట్ చేసుకోవాలి . )

ములక్కాడలు  --  2  
( ముక్కలుగా  కట్ చేసుకోవాలి . )

ఆనపకాయ  లేదా  సొరకాయ  --  ఒక ముక్క .  (  పై  చెక్కు తీసుకుని  ముక్కలుగా  చేసుకోవాలి )

అరటికాయ  --  పెద్దది  ఒకటి .  (  చెక్కు  తీసుకుని  ముక్కలుగా  చేసుకోవాలి )

దొండకాయలు --   8 ( ముక్కలుగా  తరుగు కోవాలి .)

పచ్చి బఠాని  గింజలు  --  అర కప్పు .

కొత్తిమీర  --  ఒక  కట్ట . (  సన్నగా  తరుగు కోవాలి .)

కరివేపాకు  --  మూడు రెమ్మలు .

కొబ్బరి  నూనె  లేదా  /  నెయ్యి  --  ఆరు  స్పూన్లు

కొబ్బరి కాయ  --  1  (  రెండు  చిప్పలు  కోరాముతో  తురుము కోవాలి . )

గట్టి పెరుగు  --  అర లీటరు . ( పుల్లగా ఉంటే  బాగుండదు . కమ్మగా ఉండాలి . )

జీలకర్ర  --  స్పూను

పచ్చి మిరపకాయలు --   8
 
పోపునకు .

ఎండుమిరపకాయలు  --  4  ( ముక్కలుగా   చేసుకోవాలి )
ఆవాలు  --  అర స్పూను .

తయారు చేయు విధానము .

ముందుగా   తరిగి  సిద్ధంగా  ఉంచుకున్న  ముక్కలు మరియు ఒలుచుకున్న బఠాణీ గింజలు  ఒక గిన్నెలో  వేసుకుని  సరిపడా  ఉప్పు  మరియు  నీళ్ళు పోసుకుని  కుక్కర్ లో  పెట్టుకుని  మూడు విజిల్స్  రానిచ్చి  దింపుకుని  కొద్దిగా  నీరు  ఉంటే  గిన్నెలో  అలాగే  ఉంచుకోవాలి .

తర్వాత  తురిమిన పచ్చి కొబ్బరి , పచ్చిమిరపకాయలు , జీలకర్ర , సరిపడా ఉప్పు వేసుకుని  మరియు కొద్దిగా  నీళ్ళు పోసుకుని  మరీ పల్చగా  కాకుండా  ముద్దలా  వేసుకోవాలి .

ఇప్పుడు  స్టౌ మీద  ఉడికిన నీళ్ళతో  ఉన్న ముక్కల గిన్నెను  పెట్టి , అందులో   మిక్సీ  వేసుకున్న కొబ్బరి  ముద్దను  వేసి , ముక్కలు  ముద్ద బాగా  దగ్గర పడి  కలిసి పోయేలా  ఓ పది   నిముషాలు   ముద్ద పచ్చి వాసన పోయేదాకా  ఉడకనివ్వాలి .

ఆ తర్వాత  ముక్కలతో   ఉడికిన  మిశ్రమాన్ని బాగా  చల్లారనివ్వాలి .

వేడి  మీద పెరుగు కలిపితే  విరిగి  పోతుంది .

తర్వాత  పెరుగును  గరిటతో  బాగా  కలుపుకుని  ఈ  ముక్కలలో  వేసుకుని  గరిటెతో  బాగా కలుపుకోవాలి .

ఆ తర్వాత  స్టౌ మీద  బాండీ  పెట్టి  మొత్తము  నెయ్యి వేసి , నెయ్యి  బాగా  కాగగానే  ఎండుమిరపకాయలు , ఆవాలు , కరివేపాకు  వేసుకుని  పోపు  వేసుకుని  ఈ  పెరుగు కలిపిన  ముక్కలలో  వేసుకోవాలి .

తర్వాత తరిగిన  కొత్తిమీర  కూడా  వేసుకుని  గరిటెతో  బాగా కలుపుకోవాలి .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  అవియళ్  చపాతీల లోకి , భోజనము  లోకి , చివరికి  వట్టిగా  తినడానికి  కూడా  సర్వింగ్  కు సిద్ధం .

పసుపు వేస్తే అవియళ్ తెల్లగా  ఉండదు . పసుపు అవసరం లేదు.

పోపు దినుసులు మినపప్పు , పచ్చిశనగపప్పు  వంటివి  ఇందులో బాగుండదు .

ఇంగువ ,  ఎండు కారము వంటివి వేసినా  బాగుండవు .

ఎంత కమ్మగా  ఉంటే  అవియళ్  అంత  రుచిగా  ఉంటుంది .

ఎవరైనా  అతిధులు మన ఇంటికి వచ్చినప్పుడు  మరియు ప్రత్యేక సందర్భాలలో  ఈ అవియళ్  తయారు చేసుకుంటే  చాలా  కలర్ ఫుల్ గా ఉండి ఫంక్షన్ కు నిండు తనం  తెస్తుంది .

సంబంధించిన  రెసిపీ మరియు ఫోటో నా స్వంతం .

Wednesday, July 4, 2018

మాగాయ ఉల్లిపాయ పెరుగు పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .

మాగాయ ఉల్లిపాయ పెరుగు   పచ్చడి.
****************************

తయారుచేయు  విధానము .

ఒక  గిన్నెలో  నాలుగు  స్పూన్లు   మాగాయ  పచ్చడి  తీసుకోండి .

స్టౌ  మీద  గిన్నెలో ఓ అర గ్లాసు  నీళ్ళు  పెట్టుకొని   ఆ నీళ్ళు  బాగా  మరగనిచ్చి ,  గిన్నెలో  తీసుకున్న  మాగాయలో  కొద్దిగా    వేడి  నీళ్ళు  పోసుకుని , చేయి  కాలుతుంది  కాబట్టి  గరిటతో    కలుపుకోండి.

దోశెలలోకి  కాబట్టి  మరీ  పల్చగా  అక్కరలేదు .గట్టిగానే  కలపండి.

వేడి  నీళ్ళు  పోస్తే పచ్చడి  రెండు  మూడు  రోజులు  నిల్వ ఉంటుంది.

ఇప్పుడు  మూడు  పెద్ద ఉల్లిపాయలు  ముక్కలుగా  తరుగుకోండి .

అయిదు  పచ్చి  మిరపకాయలు  కూడా  ముక్కలుగా  తరుగుకోండి.

ఇప్పుడు  మిక్సీలో  పచ్చిమిర్చి ,   మాగాయ పచ్చడి మరియు రెండు గరిటల  పెరుగు  వేసి  మెత్తగా గ్రైండ్  చేసుకొని   వేరే గిన్నెలోకి  తీసుకోండి .

ఇప్పుడు   స్టౌ  మీద  బాండీ  పెట్టి  మూడు  స్పూన్లు  నెయ్యి   వేసుకుని   మూడు  ఎండు మిర్చి ముక్కలుగా  చేసి , స్పూనున్నర పచ్చిశనగపప్పు  , స్పూను మినపప్పు , అరస్పూను ఆవాలు ,  కొద్దిగా ఇంగువ , రెండు రెమ్మలు కరివేపాకు   వేసి  పోపు పెట్టుకుని  అందులో  ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మూతపెట్టి  ఉల్లిపాయలను బాగా   మగ్గ నివ్వాలి .

ఉప్పు  తగ్గితే  కొంచెం   కలుపుకోండి.

ఈ మగ్గిన ఉల్లిపాయలు పోపుతో సహా పచ్చడిలో వేసుకుని  గరిటె తో  బాగా కలుపుకోండి.

అంతే  ఉల్లిపాయ మాగాయ  పెరుగు పచ్చడి  భోజనము  లోకి, చపాతీలు, రోటీలు    మరియు  దోశెల లోకి  సర్వింగ్  కు సిద్ధం.

సంబంధిత రెసిపీ మరియు ఫోటో  నా స్వంతం .

వంకాయ పెరుగు పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .

వంకాయ    పెరుగు పచ్చడి.

రెండు  వంకాయలు తీసుకుని  పుచ్చులు లేకుండా చూసుకుని  కాయ అంతా  నూనె  రాసి   స్టౌ వెలిగించి సిమ్ లో పెట్టుకుని , కాయలను మధ్య మధ్య తిప్పుతూ అన్ని  వైపులా  బాగా  కాల్చుకోవాలి.

చల్లారాక   నీళ్ళతో తడి  చేయి చేసుకుని  పై  పొట్టు  తీసేసుకోవాలి.

తిరిగి స్టౌ  వెలిగించి   బాండీ  పెట్టి  రెండు  స్పూన్లు  నెయ్యి  వేసి  రెండుఎండు మిర్చి  ముక్కలుగా చేసి , స్పూను  మినపప్పు  ,అర స్పూను  ఆవాలు , పావు స్పూను జీలకర్ర  , కొద్దిగా  ఇంగువ మరియు  రెండు రెమ్మలు కరివేపాకు  వేసి పోపు  వేయించు కోవాలి .

ఒక  కట్ట కొత్తిమీర , మూడు పచ్చిమిర్చి  మరియు కొద్దిగా  ఉప్పు వేసి మిక్సీ లో తిప్పుకోవాలి .

ఒక  గిన్నెలో   కాల్చి  పై  తొక్క తీసి సిద్ధంగా  ఉంచుకున్న   వంకాయలు   , రెండు కప్పుల పెరుగు వేసి  , కొంచెం  ఉప్పు వేసి  చేత్తో  బాగా  కలుపు కోవాలి .

తర్వాత సిద్ధంగా  ఉంచుకున్న  కొత్తిమీర మరియు పచ్చిమిర్చి   పేస్ట్  కూడా వేసి  స్పూనుతో బాగా కలుపుకోవాలి .

ఆ  తర్వాత  సిద్ధం  చేసుకున్న   పోపు   అందులో  వేసుకొని  బాగా  కలిపి  పైన  కొత్తిమీర   వేసుకోవాలి .

అంతే  వంకాయ  పెరుగు  పచ్చడి  సర్వింగ్  కు  సిద్ధం.

ఈ పచ్చడి  భోజనము  లోకి  మరియు దోశెలలోకి కూడా బాగుంటుంది .

సంబంధించిన  రెసిపీ  మరియు ఫోటో నా స్వంతం .

Saturday, April 14, 2018

అవియళ్

ఆలూరుకృష్ణప్రసాదు .

అవియళ్ .

అవియళ్  కేరళ వారి వంటకం.

ఇందులో అన్ని కూరగాయ ముక్కలు వేసుకుంటారు  కావున  చాలా  బలవర్ధకమైన  వంటకము.

కేరళ ప్రాంతంలో  వారు  అన్ని వంటలకు  కొబ్బరి  నూనెను వాడతారు .

అందువల్ల వారు ఈ అవియళ్ లో కూడా కొబ్బరి నూనె నే వాడతారు .

నిజానికి  మనం కూడా కొబ్బరి  నూనె  వాడితేనే  మంచిది.

ఒకవేళ  కొబ్బరి  నూనె  వేసుకోవడం ఇష్టం లేకపోతే  నూనె  వాడకండి .

దాని బదులుగా  నెయ్యి వాడండి.

ఇంక ఈ అవియళ్  కు కావలసిన వస్తువులు మరియు తయారు  చేయు విధానము గురించి  తెలుసుకుందాము.

కావలసినవి .

బంగాళా దుంపలు  --  రెండు.(  పై చెక్కు తీసి  ముక్కలుగా  చేసుకోవాలి )

క్యారెట్  --  రెండు ( చెక్కు  తీసుకోవాలి )

బీన్స్  -- చిన్న ముక్కలుగా  కట్ చేసుకోవాలి .)

ములక్కాడలు  --  2  ( 
ముక్కలుగా  కట్ చేసుకోవాలి .) 

ఆనపకాయ  లేదా  సొరకాయ  --  ఒక ముక్క .  (  పై  చెక్కు తీసుకుని  ముక్కలుగా  చేసుకోవాలి )

అరటికాయ  --  పెద్దది  ఒకటి .  (  చెక్కు  తీసుకుని  ముక్కలుగా  చేసుకోవాలి )

దొండకాయలు --   8 ( ముక్కలుగా  తరుగు కోవాలి .)

పచ్చి బఠాని  గింజలు  --  అర కప్పు .

కొత్తిమీర  --  ఒక  కట్ట . (  సన్నగా  తరుగు కోవాలి .)

కరివేపాకు  --  మూడు రెమ్మలు .

కొబ్బరి  నూనె  లేదా  /  నెయ్యి  --  ఆరు  స్పూన్లు

కొబ్బరి కాయ  --  1  (  రెండు  చిప్పలు  కోరాముతో  తురుము కోవాలి . )

గట్టి పెరుగు  --  అర లీటరు . ( పుల్లగా ఉంటే  బాగుండదు . కమ్మగా ఉండాలి . )

జీలకర్ర  --  స్పూను

పచ్చి మిరపకాయలు --   6 
పోపునకు .

ఎండుమిరపకాయలు  --  4  ( ముక్కలుగా   చేసుకోవాలి )
ఆవాలు  --  అర స్పూను .

తయారు చేయు విధానము .

ముందుగా   తరిగి  సిద్ధంగా  ఉంచుకున్న  ముక్కలు మరియు ఒలుచుకున్న బఠాణీ గింజలు  ఒక గిన్నెలో  వేసుకుని  సరిపడా  ఉప్పు  మరియు  నీళ్ళు పోసుకుని  కుక్కర్ లో  పెట్టుకుని  మూడు విజిల్స్  రానిచ్చి  దింపుకుని  కొద్దిగా  నీరు  ఉంటే  గిన్నెలో  అలాగే  ఉంచుకోవాలి .

తర్వాత  తురిమిన పచ్చి కొబ్బరి , పచ్చిమిరపకాయలు , జీలకర్ర , సరిపడా ఉప్పు వేసుకుని  మరియు కొద్దిగా  నీళ్ళు పోసుకుని  మరీ పల్చగా  కాకుండా  ముద్దలా  వేసుకోవాలి .

ఇప్పుడు  స్టౌ మీద  ఉడికిన నీళ్ళతో  ఉన్న ముక్కల గిన్నెను  పెట్టి , అందులో   మిక్సీ  వేసుకున్న కొబ్బరి  ముద్దను  వేసి , ముక్కలు  ముద్ద బాగా  దగ్గర పడి  కలిసి పోయేలా  ఓ పది   నిముషాలు   ముద్ద పచ్చి వాసన పోయేదాకా  ఉడకనివ్వాలి .

ఆ తర్వాత  ముక్కలతో   ఉడికిన  మిశ్రమాన్ని బాగా  చల్లారనివ్వాలి .

వేడి  మీద పెరుగు కలిపితే  విరిగి  పోతుంది .

తర్వాత  పెరుగును  గరిటతో  బాగా  కలుపుకుని  ఈ  ముక్కలలో  వేసుకుని  గరిటెతో  బాగా కలుపుకోవాలి .

ఆ తర్వాత  స్టౌ మీద  బాండీ  పెట్టి  మొత్తము  నెయ్యి వేసి , నెయ్యి  బాగా  కాగగానే  ఎండుమిరపకాయలు , ఆవాలు , కరివేపాకు  వేసుకుని  పోపు  వేసుకుని  ఈ  పెరుగు కలిపిన  ముక్కలలో  వేసుకోవాలి .

తర్వాత తరిగిన  కొత్తిమీర  కూడా  వేసుకుని  గరిటెతో  బాగా కలుపుకోవాలి .

అంతే  ఎంతో  రుచిగా  ఉండే  అవియళ్  చపాతీల లోకి , భోజనము  లోకి , చివరికి  వట్టిగా  తినడానికి  కూడా  సర్వింగ్  కు సిద్ధం .

పసుపు వేస్తే అవియళ్ తెల్లగా  ఉండదు . పసుపు అవసరం లేదు.

పోపు దినుసులు మినపప్పు , పచ్చిశనగపప్పు  వంటివి  ఇందులో బాగుండదు .

ఇంగువ ,  ఎండు కారము వంటివి వేస్తే  బాగుండవు .

ఎంత కమ్మగా  ఉంటే  అవియళ్  అంత  రుచిగా  ఉంటుంది .

ఎవరైనా  అతిధులు మన ఇంటికి వచ్చినప్పుడు  మరియు ప్రత్యేక సందర్భాలలో  ఈ అవియళ్  తయారు చేసుకుంటే  చాలా  కలర్ ఫుల్ గా ఉండి ఫంక్షన్ కు నిండు తనం  తెస్తుంది .

Saturday, January 6, 2018

బంగాళాదుంపల పెరుగు పచ్చడి

ఆలూరుకృష్ణప్రసాదు .

బంగాళాదుంపలతో పెరుగు పచ్చడి .

తయారీ విధానము.

పావు కిలో బంగాళాదుంపలు తొక్కుతో ముక్కలుగా తరిగి  కుక్కర్ లో మూడు విజిల్స్  వచ్చే వరకు ఉడికించి  పై తొక్కు తీసుకొని  ముక్కలుగా చేసుకోవాలి .

ఒక చిన్న కట్ట కొత్తిమీర , నాలుగు పచ్చిమిరపకాయలు , చిన్న అల్లం  ముక్క, తగినంత  ఉప్పు వేసి  మిక్సీ లో మరీ మెత్తగా  కాకుండా వేసుకోవాలి .

అర లీటరు  పెరుగు ఒక గిన్నెలో  పోసి బాగా  గరిటతో కలుపుకుని , అందులో ఉడికించిన బంగాళాదుంప  ముక్కలు , మిక్సీ  వేసుకున్న కొత్తిమీర , పచ్చిమిర్చి  మిశ్రమం  వేసుకుని  గరిటతో  బాగా కలుపుకోవాలి.

స్టౌ మీద పోపు గరిటె  పెట్టుకుని  మూడు స్పూన్లు  నెయ్యి  వేసుకుని  రెండు ఎండుమిరపకాయలు  ముక్కలుగా  చేసుకుని , స్పూను  చాయమినపప్పు , పావు స్పూను జీలకర్ర , అర స్పూను  ఆవాలు , కొద్దిగా  ఇంగువ మరియు  రెండు రెబ్బలు కరివేపాకు  వేసుకుని  పోపు వేగగానే  ఈ పెరుగు పచ్చడిలో వేసుకుని  గరిటతో బాగా కలుపుకోవాలి .

అంతే ఎంతో రుచిగా ఉండే బంగాళాదుంపలతో  పెరుగు పచ్చడి  రోటీలు , చపాతీలు మరియు భోజనము లోకి  సిద్ధం.

Thursday, November 30, 2017

పచ్చి కొబ్బరి తురుముతో  పెరుగు పచ్చడి.

ఆలూరుకృష్ణప్రసాదు .

పచ్చి కొబ్బరి తురుముతో  పెరుగు పచ్చడి.

కావలసినవి.

కొబ్బరి  కాయ --  పగుల కొట్టి  రెండు చిప్పలూ పచ్చి కొబ్బరి తురుముతో  తురుము కోవాలి .

పెరుగు  --  అర  లీటరు .

పులుపు ఇష్టమైన వారు పుల్లని పెరుగు , పచ్చడి  కమ్మగా ఇష్టమైన వారు కమ్మని పెరుగు వాడు కోవచ్చును.

పచ్చి మిరపకాయలు  --  8
అల్లం  --  అంగుళం ముక్క ఒకటి

కొత్తిమీర  --  చిన్న కట్టలు రెండు .

ఉప్పు  --  తగినంత .

పోపునకు.

నెయ్యి --  మూడు స్పూన్లు .
ఎండుమిరపకాయలు  4  ముక్కలుగా  చేసుకోవాలి .
చాయమినపప్పు  --  స్పూనున్నర .
జీలకర్ర  --  పావు స్పూను .
ఆవాలు --  అర స్పూను .
ఇంగువ  --  కొద్దిగా
కరివేపాకు  --  మూడు రెమ్మలు .

తయారీ విధానము .

పచ్చిమిరపకాయలు తొడిమలు  తీసి ఉంచుకోవాలి.

అల్లం చెక్కు  తీసి , ముక్కలుగా చేసుకోవాలి .

కొత్తిమీర  విడదీసి శుభ్రం చేసుకోవాలి .

ఇప్పుడు మిక్సీ లో పచ్చిమిరపకాయలు , తరిగిన  అల్లం  ముక్కలు , కొత్తిమీర లో మూడు వంతులు , తగినంత  ఉప్పు వేసి మెత్తగా  మిక్సీ  వేసుకోవాలి .

ఇప్పుడు  ఒక గిన్నెలో సిద్ధంగా  ఉంచుకున్న  పెరుగు , తురిమి ఉంచుకున్న  పచ్చి కొబ్బరి తురుము , మిగిలిన ఒక వంతు కొత్తిమీర  మరియు  మిక్సీ  వేసుకున్న మిశ్రమము వేసి  గరిటతో బాగా కలుపుకోవాలి.

తర్వాత స్టౌ మీద పోపు గరిట పెట్టి  మొత్తము  నెయ్యి వేసి నెయ్యి బాగా కాగగానే  వరుసగా ఎండుమిరపకాయల ముక్కలు, చాయమినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకు  వేసి పోపు పెట్టి , కొబ్బరి పెరుగు పచ్చడి లో కలుపుకోవాలి .

అద్భుతమైన  కొత్తిమీర  సువాసనతో  రుచిగా ఉండే ఈ కొబ్బరి తురుము పెరుగు పచ్చడి  ఇడ్లీ , దోశెలలోకి  మరియు భోజనము లోకి కూడా  ఎంతో బాగుంటుంది .

ఫోటో  ---  ఈ రోజు  నేను స్వయముగా  చేసుకున్న  పచ్చి కొబ్బరి  తురుము పెరుగు పచ్చడి .

ఎలా ఉందో మీరే చెప్పాలి ?

Wednesday, June 14, 2017

వంకాయ పెరుగు పచ్చడి

వంకాయ పెరుగు పచ్చడి
ఆలూరి కృష్ణ ప్రసాద్ 

కావలసిన పదార్థాలు :
వంకాయలు - 2, పెరుగు - ఒక కప్పు, 
పోపు గింజలు - ఒక స్పూన్, 
ఎండుమిర్చి - 1, 
కరివేపాకు - ఒక రెమ్మ, 
కొత్తిమీర - అర కట్ట, 
నూనె - 2 స్పూన్స్, 
ఉప్పు - తగినంత 
తయారుచేసే విధానం :
ముందు వంకాయలను బాగా కడిగి తుడవాలి. వాటికి నూనె రాసి స్టౌ మీద కాల్చాలి. ఈ కాల్చిన వంకాయపై మాడిన పొట్టంతా తీసేయాలి. ఆ తర్వాత ఆ వంకాయలను చేతితో చిదమాలి. దీంట్లో ఉప్పు, పెరుగు కలపాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి పోపు గింజలు వేసి దోరగా వేగాక ఎండుమిర్చి, కరివేపాకు వేసి దించేయాలి. ఈ మిశ్రమాన్ని వంకాయ పచ్చడిలో కలిపి పై నుంచి కొత్తిమీర చల్లాలి. అంతే.. నోరూరించే వంకాయ పచ్చడి మీ ముందుంటుంది

సొరకాయ పచ్చి కొబ్బరి పచ్చడి

సొరకాయ పచ్చి కొబ్బరి  పెరుగు పచ్చడి.
ఆలూరి కృష్ణ ప్రసాద్ 

ఈ  పెరుగు  పచ్చడి తయారు  చేయడానికి   లేత  సొరకాయ  అయితే  బాగుంటుంది .
కావలసినవి  .
లేత  సొరకాయ చిన్నది  --
పై  చెక్కు తీసి  రెండు కప్పులకు  సరిపడా  ముక్కలు  సన్నగా  తరుగుకొని  సిద్ధం  చేసుకోవాలి .
పచ్చి  కొబ్బరి  తురుము  -  ఒక  కప్పు .
పచ్చి  మిరపకాయలు  -  ఆరు 
అల్లం   --   చిన్న  ముక్క .
కరివేపాకు  --  మూడు స్పూన్లు 
కొత్తిమీర   ---  ఒక  కట్ట .
పసుపు  --  కొద్దిగా 
ఉప్పు  --  తగినంత 
జీలకర్ర  ---  స్పూను 
నూనె  ---  మూడు స్పూన్లు 
పోపు  కు  కావలసినవి .
నెయ్యి  --  మూడు స్పూన్లు 
ఎండు  మిర్చి  ---  మూడు
మినపప్పు   ---  స్పూను 
మెంతులు  --  పావు స్పూను
ఆవాలు  ---  అర స్పూను 
ఇంగువ  ---  కొద్దిగా 
తయారి  విధానము .
ముందుగా  పచ్చిమిర్చి  మరియు అల్లం    కొంచెం  నలిగేటట్లు  మిక్సీ  వేసుకోవాలి .
ఒక  గిన్నెలో  కమ్మని  అర  లీటరు  పెరుగు  తీసుకొని  గరిటతో  బాగా  కలుపుకోవాలి .
అందులో  సరిపడా  ఉప్పు  వేసుకోవాలి .
స్టౌ  మీద  బాండి  పెట్టి  రెండు  స్పూన్ల  నూనె  వేసి  నూనె  బాగా  కాగాక   స్పూను   జీలకర్ర , మూడు రెమ్మల  కరివేపాకు   వేసి అందులో  పై చెక్కు  తీసి  ముందుగా  సన్నగా  తరిగి  సిద్ధంగా  ఉంచుకున్న   రెండు కప్పుల  సొరకాయ  ముక్కలు    వేసి  మూతపెట్టి  మెత్తగా   మగ్గ నివ్వాలి.
చల్లారాక  మగ్గిన  సొరకాయ  ముక్కల్ని  పెరుగులో  కలపాలి .
కప్పు  పచ్చి కొబ్బరి  తురుము  కూడా అందులో  కలపాలి .
అల్లం  పచ్చి  మిర్చి   మిశ్రమం  అందులో కలపాలి .
ఇప్పుడు  స్టౌ  మీద  బాండీ  పెట్టి  మూడు  స్పూన్ల  నెయ్యి  వేసి 
ఎండు  మిర్చి , మినపప్పు  , మెంతులు , ఆవాలు ,  ఇంగువ  వేసి పోపు  పెట్టుకుని   పెరుగులో  కలపాలి .
కొత్తిమీర  కడిగి  కట్  చేసుకొని   పెరుగు లో  వేసి  అన్నీ  బాగా  కలిసేటట్లు  కలుపుకోవాలి .
అంతే  సొరకాయ  పచ్చి కొబ్బరి  పెరుగు పచ్చడి  సర్వింగ్  కు  సిద్ధం .
ఈ  పచ్చడి  అన్నం లోకే  కాక  రైతా  లాగా  చపాతీలలో  కూడా  చాలా  రుచిగా   ఉంటుంది .

Thursday, June 1, 2017

పచ్చి కొబ్బరి పెరుగు పచ్చడి.

పచ్చి కొబ్బరి పెరుగు పచ్చడి.
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 

కావలసినవి.
పెరుగు -- అర లీటరు .
కొబ్బరి కాయ -- ఒకటి
పచ్చి మిర్చి --- మూడు
అల్లం -- చిన్న ముక్క
కొత్తిమీర - ఒక కట్ట
ఉప్పు -- తగినంత

పోపుకు.
నెయ్యి -- మూడు స్పూన్లు 
ఎండుమిర్చి -- మూడు . ( ముక్కలుగా చేసుకోవాలి . )
మినపప్పు -- స్పూను 
జీలకర్ర -- పావు స్పూను 
శనగపప్పు -- స్పూను
ఆవాలు -- అర స్పూను 
కరివేపాకు -- రెండు రెమ్మలు .

తయారీ విధానము .
కొబ్బరి కాయ కొట్టి రెండు చిప్పలు కోరాముతో తురుముకోవాలి.
ఒక గిన్నెలో పెరుగు వేసుకుని అందులో అల్లం పచ్చిమిర్చి దంచి వేసుకోవాలి .
తురిమిన కొబ్బరి పెరుగులో కలపాలి.
తగినంత ఉప్పు అందులో కలపాలి .
కొత్తిమీర సన్నగా తరిగి అందులో కలుపు కోవాలి.
ఇప్పుడు గరిటతో అన్నీ బాగా కలుపు కోవాలి .
తర్వాత స్టౌ వెలిగించి బాండీ పెట్టి నెయ్యి వేసి పోపు పెట్టుకోవాలి.
పెరుగు కమ్మగా ఉంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది .
కొబ్బరి మరీ ముదిరితే బాగుండదు.
కాయ మధ్యస్థంగా ఉండాలి
అంతే అన్నం లోకి ఇడ్లీ దోశెల లోకి రుచికరమైన కొబ్బరి పెరుగు పచ్చడి సర్వింగ్ కు రెడీ.

Wednesday, May 31, 2017

మాగాయ పెరుగుపచ్చడి

మాగాయ పెరుగుపచ్చడి
 ఆలూరి కృష్ణ ప్రసాద్ 

ఇడ్లీలలోకి మాగాయ పెరుగుపచ్చడి చేసుకునే విధానము .
ముందుగా మూడు చెంచాలు మాగాయ పచ్చడి ఒక గిన్నెలోకి తీసుకోండి.

అందులో రెండు గరిటలు పెరుగు వేసుకోండి.
చేతితో బాగా కలిసేలా కలపండి.
మూడు పచ్చి మిర్చి మరియు పెరుగు కలిపిన మాగాయ పచ్చడి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
ఇప్పుడు కొంచెము రుచి చూడండి.
ఉప్పు సరిపోతుంది . వేయక్కరలేదు .
ఒకవేళ ఉప్పు సరిపోకపోతే కొద్దిగా కలుపుకోండి.
ఇడ్లీలలోకి కాబట్టి పచ్చడి కొంచెము పల్చగా ఉంటే బాగుంటుంది.
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నెయ్యి వేసి రెండు ఎండు మిర్చి , మినపప్పు ,
ఆవాలు , ఇంగువ , రెండు కరివేపాకు రెబ్బలు వేసి పోపు పెట్టుకోండి.

అంతే .
నోరూరించే మాగాయ పెరుగు పచ్చడి వేడి వేడి ఇడ్లీల లోకి సిద్ధం.
ఇంక దోశెలలోకి మాగాయ ఉల్లిపాయ పెరుగు పచ్చడి.
****************************

తయారుచేయు విధానము .
ఒక గిన్నెలో నాలుగు స్పూన్లు మాగాయ పచ్చడి తీసుకోండి .
స్టౌ మీద గిన్నెలో నీళ్ళు పెట్టుకొని ఆ నీళ్ళు బాగా మరగనిచ్చి , గిన్నెలో తీసుకున్న మాగాయలో కొద్దిగా వేడి నీళ్ళు పోసుకుని , చేయి కాలుతుంది కాబట్టి గరిటతో కలుపుకోండి.
దోశెలలోకి కాబట్టి మరీ పల్చగా అక్కరలేదు .గట్టిగానే కలపండి.
వేడి నీళ్ళు పోస్తే పచ్చడి రెండు మూడు రోజులు నిల్వ ఉంటుంది.
ఇప్పుడు మూడు పెద్ద ఉల్లిపాయలు మరీ సన్నగా కాకుండా ముక్కలు తరుగుకోండి .
అయిదు పచ్చి మిరపకాయలు కూడా ముక్కలుగా తరుగుకోండి.
ఇప్పుడు మిక్సీలో పచ్చిమిర్చి మాగాయ పచ్చడి రెండు గరిటల పెరుగు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసుకోండి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె గాని నెయ్యి గాని వేసుకుని మూడు ఎండు మిర్చి , శనగపప్పు , మినపప్పు , ఆవాలు , ఇంగువ , కరివేపాకు వేసి పోపు పెట్టుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గ నివ్వండి .
తర్వాత ఈ ఉల్లిపాయలు కలిపిన పోపును మిక్సీ వేసుకున్న మాగాయ పచ్చడిలో కలుపుకోండి.
ఉప్పు తగ్గితే కొంచెం కలుపుకోండి.
అంతే ఉల్లిపాయ మాగాయ పెరుగు పచ్చడి అన్నం లోకి మరియు దోశెల లోకి సిద్ధం.
Photo A .G . K . blog.

Tuesday, May 30, 2017

వంకాయ పెరుగు పచ్చడి

వంకాయ పెరుగు పచ్చడి
ఆలూరి కృష్ణ ప్రసాద్

రోటితో మిక్సీతో పని లేకుండా అప్పటికప్పుడు భోజనానికి ముందు తయారు చేసుకునే వంకాయ పెరుగు పచ్చడి.
స్టౌ వెలిగించి వంకాయకు నూనె రాసి అన్ని వైపులా బాగా కాల్చుకోవాలి.
చల్లారాక తడి చేత్తో పై పొట్టు తీసేసుకోవాలి.
స్టౌ వెలిగించి బాండీ పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేసి ఎండు మిర్చి ముక్కలు , స్పూను మినపప్పు , ఆవాలు , జీలకర్ర , ఇంగువ , కరివేపాకు , పచ్చిమిర్చి ముక్కలు పోపు వేయించు కోవాలి .
ఒక గిన్నెలో కాల్చి పై తొక్క తీసిన వంకాయ వేసి , ఒక కప్పు పెరుగు వేసి , తగినంత ఉప్పు వేసి చేత్తో బాగా కలుపు కోవాలి .
ఆ తర్వాత సిద్ధం చేసుకున్న పోపు అందులో వేసుకొని బాగా కలిపి పైన కొత్తిమీర వేసుకోవాలి .
అంతే వంకాయ పెరుగు పచ్చడి సర్వింగ్ కు సిద్ధం.

Followers

All rights reserved by ఆహా ఏమి రుచి