ఆలూరుకృష్ణప్రసాదు .
మరో వెరైటి మిర్చి బజ్జీ.
తయారీ విధానము .
ఓ పావు కిలో బోలుగా ఉన్న పెద్ద సైజు మిర్చి బజ్జీ తీసుకుని మధ్యలో గాటు పెట్టు కోవాలి.
రెండు బంగాళా దుంపలు ఉడక పెట్టుకుని పై తొక్క తీసుకుని , ముక్కలుగా చేసుకోవాలి .
స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే , స్పూను శనగపప్పు , స్పూను మినపప్పు , పావు స్పూను జీలకర్ర , అరస్పూను ఆవాలు , కొద్దిగా ఇంగువ, కరివేపాకు మరియు రెండు పచ్చిమిర్చి ముక్కలుగా తరిగి వేసుకుని పోపు పెట్టుకుని అందులో ఉడికించిన బంగాళా దుంపలు కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు మరియు తరిగిన కొత్తిమీర వేసి ముద్దకూర చేసుకోవాలి .
ఆ కూరను మిరపకాయలలో బాగా నిండుగా కూరుకోవాలి .
ఒక వంద గ్రాముల శనగ పిండిలో , ఒక స్పూనున్నర బియ్యపు పిండి , కొద్దిగా ఉప్పు మరియు చిటికెడు వంట సోడా వేసుకుని తగినన్ని నీళ్ళు పోసుకుని బజ్జీలు వేసుకునే విధముగా పిండిని జారుగా కలుపు కోవాలి .
తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి పావు కిలో నూనె పోసి నూనె బాగా కాగనివ్వాలి .
తరువాత Stuff చేసిన మిరపకాయలు శనగ పిండిలో ముంచి బజ్జీలు నూనెలో వేసి కర కర లాడే విధముగా వేయించుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే బంగాళా దుంప కూర Stuff చేసిన మిరపకాయల బజ్జీలు అల్పాహారంగా సర్వింగ్ కు సిద్ధం.
అల్లం పచ్చడితో తింటే బాగుంటుంది.
0 comments:
Post a Comment