ఆలూరుకృష్ణప్రసాదు .
టమోటో , బెండకాయలు మరియు మునగ కాడలు వేసి కందిపప్పుతో పప్పు చారు .
తయారీ విధానము.
ఒక కప్పు కందిపప్పు ఒకసారి కడిగి కుక్కర్ లో సరిపడా నీళ్ళు పోసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టౌ ఆపేయాలి .
తర్వాత కుక్కర్ తీసి పప్పు బాగా యెనిపి , అందులో నాలుగు పచ్చిమిర్చి ముక్కలుగా తరిగి , రెండు ములక్కాడలు ముక్కలుగా తరిగి , రెండు టమోటో లు ముక్కలు గా తరిగి , ఆరు బెండకాయలు ముక్కలుగా తరిగి , నిమ్మకాయంత చింతపండు రసం గ్లాసు నీళ్ళలో పది నిముషాలు నానబెట్టి రసం తీసుకుని , కాస్త పసుపు, రెండు రెమ్మలు కరివేపాకు , సరిపడా ఉప్పు వేసి మరో గ్లాసు నీళ్ళు పోసి స్టౌ మీద పెట్టి ములక్కాడలు ఉడికే వరకు పుప్పు చారు మరగనివ్వాలి .
ఆ తర్వాత పప్పు చారు దింపాలి .
తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి , నూనె బాగా కాగగానే వరుసగా మూడు ఎండుమిరపకాయలు ముక్కలుగా చేసి , కొద్దిగా మెంతులు , పావు స్పూను జీలకర్ర , అర స్పూను ఆవాలు , కొద్దిగా ఇంగువ మరియు కొద్దిగా కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి .
ఆ తర్వాత కొత్తిమీర తరిగి పైన వేసుకోవాలి .
అంతే ఘమ ఘమ లాడే ములక్కాడ , బెండకాయ , టమోటో కందిపప్పుతో పప్పు చారు సర్వింగ్ కు సిద్ధం.
ఇష్టమైన వారు చిన్న బెల్లం ముక్క వేసుకోవచ్చు .
వెల్లుల్లి ఇష్టపడే వారు ఇంగువ బదులుగా ఎనిమిది వెల్లుల్లి రేకలు వేసుకుని పోపు వేసుకోవచ్చును.
0 comments:
Post a Comment