ఆలూరుకృష్ణప్రసాదు .
పూరీలు / చపాతీలు / మరియు రోటీల లోకి వెజిటబుల్ కూర్మా .
కావలసినవి.
బంగాళా దుంపలు -- రెండు
క్యారెట్ -- మూడు
టమోటోలు -- రెండు
బీన్స్ -- 150 గ్రాములు.
ఈ కూరలన్నీ ముక్కలుగా చేసుకోవాలి.
క్యారెట్ , బీన్స్ మరియు బంగాళాదుంపలు వేరే గిన్నెలలో సరిపడా నీళ్ళు పోసి కుక్కర్ లో పెట్టుకుని మూడు విజిల్స్ రానిచ్చి దింపుకోవాలి.
బంగాళాదుంపలు ముక్కలు చేసి ఉడికిన తర్వాత పై తొక్కు తీసుకోవాలి .
ఇవ్వన్నీ విడిగా వేరే ప్లేటులో ఉంచుకోవాలి .
కూర్మా కూర గ్రేవీ కు.
ఎండుమిరపకాయలు -- 4
టమోటోలు -- రెండు
ధనియాలు -- స్పూను
దాల్చిన చెక్క -- చిన్న ముక్క
పచ్చి కొబ్బరి తురుము -- మూడు స్పూన్లు .
జీడిపప్పు -- 6
పచ్చి బఠాణీలు -- పావు కప్పు
కావలసిన మిగిలిన వస్తువులు.
కరివేపాకు -- మూడు రెమ్మలు
కొత్తిమీర -- చిన్న కట్ట
పసుపు -- కొద్దిగా
ఉప్పు -- తగినంత
నూనె -- నాలుగు స్పూన్లు
తయారీ విధానము .
ముందుగా స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే ఎండుమిరపకాయలు , ధనియాలు , దాల్చిన చెక్క , జీడిపప్పు వేసి వేయించుకుని అందులో టమోటో ముక్కలు మరియు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి కాసేపు ఉంచి చల్లారగానే మిక్సీలో కొద్దిగా నీళ్ళు పోసి ముద్దగా వేసుకోవాలి .
తర్వాత మళ్ళీ స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే జీలకర్ర పచ్చి బఠాణీలు , టమోటో ముక్కలు కరివేపాకు వేసి అందులో ఉడికించిన ముక్కలు , కొద్దిగా పసుపు మరియు తగినంత ఉప్పు వేసి మూత పెట్టి ముక్కలను మగ్గనివ్వాలి .
తర్వాత అందులో సిద్ధం చేసుకున్న ముద్దను వేసి కొద్దిగా నీళ్ళు పోసి గ్రేవి మొత్తము ముక్కలకు పట్టే విధముగా మగ్గ నివ్వాలి .
తర్వాత కొత్తిమీర కూడా
వేసుకుని వేరే గిన్నెలోకి తీసుకోవాలి .
అంతే పూరీ , చపాతీ లు మరియు రోటీల లోకి ఎంతో రుచిగా ఉండే కూర్మా కూర సర్వింగ్ కు సిద్ధం.
0 comments:
Post a Comment