ఆలూరుకృష్ణప్రసాదు .
వెరైటీ బెండకాయ fry.
తయారీ విధానము .
పావు కిలో బెండ కాయలు ముక్కలుగా తరుగు కోవాలి .
ఆరు పచ్చి మిర్చి , అర కప్పు కొబ్బరి ముక్కలు మరియు సరిపడా ఉప్పు వేసి కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోవాలి.
నేతిలో పది జీడిపప్పు పలుకులు వేయించుకోవాలి.
స్టౌ మీద బాండీ పెట్టి ఆరు స్పూన్లు నూనె వేసి తరిగి ఉంచుకున్న బెండకాయ ముక్కలు వేసి బంగారు రంగులో fry చేసుకోవాలి .
తర్వాత కొబ్బరి పచ్చిమిర్చి ముద్దను వేసి అది కూడా వేపుడు కూరలో ఎర్రగా వేగనివ్వాలి .
పైన వేయించిన నేతి జీడిపప్పు పలుకులను కలుపుకోవాలి.
అంతే వెరైటి బెండ కాయ fry సర్వింగ్ కు సిద్ధం.
0 comments:
Post a Comment