బీరకాయ మరియు అరటి కాయ బజ్జీలు.
తయారీ విధానము .
ఒక బీరకాయ మరియు ఒక అరటికాయ పై చెక్కు తీసుకుని చక్రాలుగా తరుగు కోవాలి.
ఒక 100 గ్రాములు శనగపిండిలో , స్పూనున్నర బియ్యపు పిండి, చిటికెడు వంటసోడా , అర స్పూను కారం, సరిపడా ఉప్పు వేసుకుని సరిపడా నీళ్ళు పోసుకుని చేతితో బాగా కలుపు కోవాలి .
తర్వాత స్టౌ మీద బాండీ పెట్టుకుని పావు కిలో నూనె పోసుకుని నూనె బాగా కాగాక ఒక్కొక్క ముక్కను పిండిలో ముంచి ఏడెనిమిది చొప్పున వేసి బంగారు రంగులో వేయించుకోవాలి .
అంతే మధ్యాహ్నం అల్పాహారము బీరకాయ మరియు అరటి కాయ బజ్జీలు సేవించడానికి సిద్ధం.
మా చిన్నప్పుడు బాపట్లలో జగన్నాథం అనే వ్యక్తి ఒక స్టాండు మీద అన్ని వస్తువులు పోస్టాఫీసు ఎదురుగా 4 గంటల కల్లా పెట్టుకుని రాత్రి 10 గంటల ద్వారా జోరుగా వ్యాపారం చేసేవాడు.
మిరపకాయబజ్జీలు , బీరకాయ అరటి కాయ బజ్జీలు , చేగోడీలు, గరం గరం ( ముంత కింద పప్పు ) ఇలా అన్ని రకములు వేడిగా అమ్మేవాడు.
వేడిగా అంటే చిల్లుల ముంతలో బొగ్గులు ( నిప్పులు ) పోసుకుని వేయించిన అటుకుల మీద పెట్టుకొని తన వెంట తీసుకుని వచ్చేవాడు.
ఆలా వేడి వేడిగా ఇచ్చే వాడు .
ఇంక బీరకాయ అరటి కాయ బజ్జీలలో అయితే పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగి బజ్జీలలో పెట్టి , పండు మిరపకాయల పచ్చడి మెత్తగా రుబ్బి అందులో నిమ్మరసం పిండి ఆ పచ్చడి ఉల్లిపాయలు కూరిన బజ్జీలలో పెట్టి ఇచ్చేవాడు.
అలా తింటే దాని రుచి చెప్పనలవి కాదు .
మీరు ఒకసారి ప్రయత్నించ వలసిందే.
0 comments:
Post a Comment