ఆలూరుకృష్ణప్రసాదు .
కొంచెం వెరైటీగా పచ్చి టమోటో లతో పచ్చడి.
కావలసినవి .
పచ్చి టమోటో లు -- 5
పచ్చి మిరపకాయలు -- 8
కొత్తిమీర -- ఒక కట్ట
ఉప్పు -- తగినంత
పసుపు -- కొద్దిగా
చింతపండు -- నిమ్మకాయంత.
పదిహేను నిముషముల క్రితం నీళ్ళల్లో నాన పెట్టుకుని చిక్కగా రసం తీసుకోవాలి .
పోపునకు .
నూనె -- నాలుగు స్పూన్లు .
ఎండుమిరపకాయలు -- 5
మినపప్పు -- స్పూను
మెంతులు -- పావు స్పూను .
ఆవాలు -- అర స్పూను .
ఇంగువ -- కొద్దిగా
కరివేపాకు -- మూడు రెమ్మలు .
తయారీ విధానము .
ముందుగా స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి పచ్చి టమోటో లు కాయల పళంగా నూనెలో వేయాలి .
అందులో పచ్చిమిరపకాయలు , పసుపు , ఉప్పు మరియు చింతపండు రసము కూడా వేసి మగ్గ నివ్వాలి .
అవి వేరే ప్లేటులో తీసుకోవాలి .
తర్వాత తిరిగి స్టౌ మీద బాండీ పెట్టి మిగిలిన నూనె వేసుకుని నూనె బాగా కాగగానే ఎండుమిరపకాయలు , మెంతులు , మినపప్పు , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకు వేసి పోపు వేయించుకోవాలి .
పోపు చల్లారగానే మిక్సీ లో ముందుగా ఎండుమిరపకాయలు పోపుతో సహా వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి.
తర్వాత వేయించిన పచ్చిమిరపకాయలు కూడా వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
చివరగా మగ్గిన టమోటోలు మరియు కొత్తిమీర కూడా వేసుకుని మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా ఒకసారి మిక్సీ వేసుకుని వేరే గిన్నె లోకి తీసుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే పచ్చి టమోటో పచ్చడి దోశెలు , చపాతీలు మరియు భోజనము లోకి సర్వింగ్ కు సిద్ధం.
0 comments:
Post a Comment