ఆలూరుకృష్ణప్రసాదు .
బీన్స్ కూర .
బీన్స్ కూర మూడు నాలుగు విధములుగా చేసుకొనవచ్చును.
ఈ రోజు ఫోటోలో చేసినది బీన్స్ కొబ్బరి కూర .
మొదటి పద్ధతి .
బీన్స్ పీచు ఉంటే తీసుకుని చిన్న ముక్కలుగా చేసుకుని కొద్దిగా ఉప్పువేసి సరిపడా నీళ్ళు పోసి ఉడక పెట్టి పోపు లో ఎండుమిర్చి , మినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ , కరివేపాకు మొదలైనవి వేసి ఉప్పూ , స్పూను కారం వేసుకుని తర్వాత ఒక చిప్ప పచ్చి కొబ్బరి తురుము వేసుకుని దింపుకోవాలి
రెండో పద్ధతి . బీన్స్ ముక్కలుగా చేసుకుని చారెడు కందిపప్పు వేసి ఉడికించి వార్చి పైన చెప్పిన విధంగా పోపు వేసి ఉప్పూ కారం వేసుకుని పప్పు కూరలా చేసుకోవచ్చు .
మూడో పద్థతి బీన్స్ కొద్దిగా పచ్చి శనగపప్పు ఉడికించి పైన చెప్పిన విధంగానే పోపు వేసి అందులో ఉడికించిన బీన్స్ చింతపండు రసం , ఉప్పూ , స్పూను కారం వేసి కొద్దిగా బెల్లం వేసుకుంటాము .
0 comments:
Post a Comment