బెండకాయ పోపు కూర.
ఆలూరు కృష్ణప్రసాదు .
కావలసినవి .
లేత బెండకాయలు -- అర కిలో .
కరివేపాకు -- నాలుగు రెమ్మలు.
ఉప్పు -- తగినంత
కారం -- స్పూను
పసుపు -- కొద్దిగా
పోపునకు .
నూనె -- ఆరు స్పూన్లు లేదా 50 గ్రాములు .
పచ్చి శనగపప్పు --- స్పూను
మినపప్పు --- స్పూను
జీలకర్ర -- పావు స్పూను
ఆవాలు -- అర స్పూను
ఇంగువ -- కొద్దిగా
తయారీ విధానము .
లేత బెండకాయలు చిన్న ముక్కలుగా తరుగు కోవాలి .
ముదురువి కూరలో వేయవద్దు .
కూర రుచి పోతుంది .
కరివేపాకు ఆకులు దూసి సిద్ధం చేసుకోవాలి .
ఎండుమిరపకాయలు ముక్కలుగా చేసుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి నూనె మొత్తం వేసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిర్చి ముక్కలు , పచ్చి శనగపప్పు , మినపప్పు , జీలకర్ర , ఆవాలు మరియు కరివేపాకు వేసి పోపు వేగగానే తరిగిన బెండ కాయ ముక్కలు , సరిపడా ఉప్పు , కొద్దిగా పసుపు వేసి మూత పెట్టి మీడియం సెగన పది నిముషాల పాటు మధ్య మధ్యలో ముక్క చితక కుండా , అడుగంటకుండా గరిటతో కలుపుతూ బెండకాయ ముక్కలు పూర్తిగా మగ్గనివ్వాలి .
తర్వాత స్పూను కారం వేసి మరో మూడు నిముషాలు ఉంచి దింపుకొని వేరే గిన్నెలోకి తీసుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే బెండకాయ పోపు కూర అన్నం లోకి సర్వింగ్ కు సిద్ధం .
ఈ కూర రోటీలలోకి మరియు చపాతీలలోకి కూడా బాగుంటుంది .
0 comments:
Post a Comment