కరివేపాకు వెల్లుల్లి కారప్పొడి
ఆలూరు కృష్ణప్రసాదు .
ఈ రోజు మా ఇంట్లో ఘమ ఘుమ లాడిన కరివేపాకు వెల్లుల్లి కారప్పొడి మీ కోసం...
వెల్లుల్లి ఇష్టపడే వారు అప్పుడప్పుడు అంటే సీజన్ మారినప్పుడు తింటే పొట్ట శుభ్రపడి తేలికగా ఉంటుంది .
కరివేపాకు వెల్లుల్లి కారప్పొడి తయారీ విధానము .
కావలసినవి .
ఎండుమిరపకాయలు -- 15
పొట్టు మినపప్పు లేదా
చాయమినపప్పు -- రెండు స్పూన్లు .
ధనియాలు -- అయిదు స్పూన్లు .
కరివేపాకు -- అర కప్పు
చింతపండు -- చిన్న నిమ్మ కాయంత .
ఉప్పు -- తగినంత .
నూనె -- మూడు స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు -- 20 పొట్టు తీయకుండా రేకలు విడదీసుకోవాలి .
తయారీ విధానము .
ముందుగా స్టౌ మీద బాండీ పెట్టి మొత్తం నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండు మిర్చి , మినపప్పు , ధనియాలు , కరివేపాకు వేసి బాగా కమ్మని వాసన వచ్చేదాకా వేయించు కోవాలి .
చల్లారగానే మిక్సీ లో వేగిన దినుసులు , చింతపండు విడదీసి మరియు తగినంత ఉప్పు వేసి కొంచెం మెత్తగా మిక్సీ వేసుకోవాలి .
చివరలో వెల్లుల్లి రెబ్బలు వేసి మరోసారి మిక్సీ వేసుకోవాలి .
తర్వాత ఒక పళ్ళెంలో వేసుకుని చేతితో బాగా కలుపుకుని ఒక సీసాలో భద్ర పరుచు కోవాలి .
ఈ పొడిని వేడి వేడి అన్నంలో మరి కాస్త నెయ్యి వేసుకుని మొదట తినాలి .
ఆరోగ్యానికి ఎంతో మంచిది .
వెల్లుల్లి ఇష్టపడని వారు మరి కాస్త ధనియాలు , కరివేపాకు , జీలకర్ర పోపులో వేసుకుని పొడి కొట్టుకోవచ్చును .
0 comments:
Post a Comment