బంగాళాదుంపతో జంతికలు .
ఆలూరు కృష్ణప్రసాదు .
బంగాళాదుంప తో జంతికలు ఏమిటి ? అని అనుకుంటున్నారా !
ఈ రెసిపీ చదవండి .
కావలసినవి .
బంగాళాదుంపలు -- రెండు
శనగ పిండి -- ఒక కప్పు
కారం --- స్పూను
మిరియాల పొడి -- పావు స్పూనుకు తక్కువగా
ఇంగువ --- కొద్దిగా
నువ్వుపప్పు -- స్పూను న్నర
ఉప్పు -- తగినంత
నూనె --- 350 గ్రాములు .
తయారీ విధానము .
ముందుగా బంగాళా దుంపలను పై చెక్కు తీయకుండా ముక్కలుగా తరిగి ఒక గిన్నెలో తగినన్ని నీళ్ళు పోసి మెత్తగా ఉడికించుకోవాలి .
చల్లారిన తర్వాత పై చెక్కు తీసుకుని ఒక గిన్నెలో వేసి మెత్తగా చేసుకోవాలి .
ఆ తర్వాత అందులో శనగపిండి , కారం , తగినంత ఉప్పు , మెత్తని మిరియాల పొడి , నువ్వు పప్పు మరియు కొద్దిగా ఇంగువ వేసి తగినన్ని నీళ్ళు పోసుకుని జంతికలు వేసుకోవటానికి అనువుగా కలుపు కోవాలి .
ఆ తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి మొత్తము నూనె పోసి నూనెను బాగా కాగనిచ్చి స్టౌ ను మీడియం సెగన పెట్టి , జంతికల గొట్టము లో ఈ పిండిని పెట్టి జంతికలు లాగా వేసుకోవాలి .
బంగాళాదుంప కలిపాము కనుక తొందరగా వేగి పోతాయి .
నల్ల రంగు రాకుండా చూసుకుని వేయించుకోవాలి .
రెండు రోజుల కన్నా నిల్వ ఉండవు కనుక తక్కువ మోతాదులో చేసుకోండి .
అంతే ఎంతో మిరియాలు , ఇంగువ , నువ్వు పప్పు రుచితో తమిళనాడు Style జంతికలు సర్వింగ్ కు సిద్ధం.
0 comments:
Post a Comment