పెద్ద చిక్కుడు కాయ ఉడక పెట్టిన కూర .
ఆలూరు కృష్ణప్రసాదు
కావలసినవి .
పెద్ద చిక్కుడు కాయలు -- పావు కిలో .
కరివేపాకు -- మూడు రెమ్మలు.
నూనె --- నాలుగు స్పూన్లు
ఉప్పు --- తగినంత
----------------
బాగా ఎండిన ఎండుమిరపకాయలు --- ఆరు
జీలకర్ర --- అర స్పూను .
ఎండుమిరపకాయలు , జీలకర్ర , కొద్దిగా ఉప్పువేసి మిక్సీ లో మెత్తని పొడిగా వేసుకోవాలి . వేరే Bowl లోకి తీసుకోవాలి .
పోపు నకు ---
ఎండుమిర్చి -- 4 ముక్కలుగా చేసుకోవాలి .
మినపప్పు --- స్పూను
జీలకర్ర -- పావు స్పూను
ఆవాలు -- అర స్పూను
ఇంగువ --- కొద్దిగా
తయారీ విధానము .
ముందుగా చిక్కుడు కాయలు రెండు వైపులా ఈనెలు తీసుకుని చిన్న చిన్న ముక్కలు గా చేసుకోవాలి .
ఒక గిన్నెలో ఈ ముక్కలు వేసి సరిపడా నీళ్ళు పోసి కొంచెం ఉప్పు వేసి , కుక్కర్ లో పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి ,
చల్లారగానే నీళ్ళు వార్చుకోవాలి .
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి మొత్తము నూనె వేసి వరుసగా ఎండుమిర్చి ముక్కలు , మినపప్పు , జీలకర్ర , ఆవాలు , కొంచెం ఇంగువ మరియు కరివేపాకు వేసి పోపు వేగగానే ఉడికిన చిక్కుడు కాయ ముక్కలు వేసి మూత పెట్టి , మీడియం సెగన పది నిముషాల పాటు మధ్య మధ్య లో కదుపుతూ మగ్గనివ్వాలి .
కూర మగ్గగానే దింపబోయే మూడు నిముషాలు ముందు మిక్సీ వేసి సిద్ధంగా ఉంచుకున్న జీలకర్ర కారం వేసి కూరను బాగా కలిపి దింపుకుని వేరే గిన్నెలో కి తీసుకోవాలి .
అంతే అన్నం లోకి మరియు చపాతీ లలోకి ఎంతో రుచిగా ఉండే పెద్ద చిక్కుడు కాయలు ఉడక పెట్టిన కూర సర్వింగ్ కు సిద్ధం .
0 comments:
Post a Comment