Sunday, July 2, 2017

కొబ్బరి అన్నం

కొబ్బరి  అన్నం  .
                                                                           ఆలూరు కృష్ణప్రసాదు .

తయారీ  విధానము .
కొబ్బరిపాలు  --  రెండు కప్పులు .
కొబ్బరి  పాలు  తీసుకునే  విధానము .
ఒక  కొబ్బరి  కాయను  కొట్టి  రెండు  చిప్పలను  పచ్చి  కొబ్బరి  కోరాముతో  తురుముకుని  మిక్సీ లో  తురుమిన  కొబ్బరి  వేసి  పావు  గ్లాసు  నీళ్ళు  పోసి  మిక్సీ   వేసుకుని  వేరే  గిన్నెలో కొబ్బరి  పాలు వడకట్టుకోవాలి .
ఇదే  పద్దతిలో  మరో  సారి  వేసుకోవాలి .
అలా  రెండు  కప్పుల  కొబ్బరి పాలు  తీసుకొని   విడిగా  ఉంచుకోవాలి .
మరో  చిప్ప  కొబ్బరి  తురుముకుని  విడిగా  ఉంచుకోవాలి .
తర్వాత  ఒక  గిన్నెలో  గ్లాసు  బియ్యం  పోసి  నీళ్ళతో  కడిగిన , తర్వాత  గ్లాసు  నీళ్ళు  పోసి  స్టౌ  మీద  పెట్టి  ఉడుకుతుండగా  సిద్ధంగా ఉంచుకున్న   రెండు  కప్పుల  కొబ్బరి పాలు  కూడా  పోసి  అన్నం  పూర్తిగా  ఉడకనివ్వాలి .
వార్చ  వద్దు .
తర్వాత  ఒక  బేసిన్  లో  అన్నం  వార్చుకోవాలి .
తర్వాత  స్టౌ  మీద  బాండి  పెట్టి   నాలుగు   స్పూన్ల  నెయ్యి వేసి  నెయ్యి  కాగగానే  నాలుగు  ఎండుమిర్చి   తుంపిన  ముక్కలు , రెండు  స్పూన్లు  పచ్చి శనగపప్పు  , స్పూనున్నర  మినపప్పు  , ముప్పావు  స్పూను  జీలకర్ర  , స్పూను  ఆవాలు , కొద్దిగా  ఇంగువ  ,  అయిదు  నిలువుగా   చీల్చిన  పచ్చిమిర్చి  , మూడు  రెమ్మలు  కరివేపాకు , స్పూను  తరిగిన అల్లం , మూడు  స్పూన్లు  పల్లీలు , పది  జీడిపప్పు  పలుకులు  వేసి  వేయించుకుని , తర్వాత  సిద్ధంగా  ఉంచుకున్న కప్పు   పచ్చి  కొబ్బరి తురుము , మరియు  తగినంత  ఉప్పు కూడా  వేసి  కొబ్బరి తురుము  పచ్చి వాసన  పోయే వరకు  కొద్దిగా  వేయించుకుని   బేసిన్  లో  సిద్ధంగా  ఉంచుకున్న   అన్నంలో  వేసుకుని కొద్దిగా  తరిగిన  కొత్తిమీర   వేసుకుని  గరిటతో  బాగా  కలుపుకోవాలి  .
అంతే  ఎంతో  రుచికరమైన  కొబ్బరి   అన్నం  సర్వింగ్   కు సిద్ధం .
ఈ  కొబ్బరి  అన్నం  టమోటా  చట్నీతో  కాని  అల్లం చట్నీతో  కాని  తింటే  చాలా రుచిగా   ఉంటుంది .

0 comments:

Post a Comment

Followers

 

All rights reserved by ఆహా ఏమి రుచి