వాక్కాయలతో పప్పు .
ఆలూరు కృష్ణప్రసాదు
పావు కిలో వాక్కాయలు ముక్కలు గా తరుగుకోవాలి .
ఒక గ్లాసు కందిపప్పు తగినన్ని నీళ్ళు పోసి స్టౌ మీద పెట్టి పప్పును మూడొంతులు ఉడకనివ్వాలి .
పప్పు మూడొంతులు ఉడకగానే తరిగిన వాక్కాయ ముక్కలు , నాలుగు పచ్చిమిర్చి ముక్కలుగా చేసినవి , కాస్త పసుపు , కరివేపాకు , తగినంత ఉప్పు మరియు స్పూను కారం పప్పు లో వేయాలి .
పప్పు మరియు వాక్కాయ ముక్కలు బాగా కలిసి పోయి పూర్తిగా ఉడకగానే దింపాలి .
మరల స్టౌ మీద పోపు గరిట పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే మూడు ఎండుమిర్చి ముక్కలుగా చేసి , జీలకర్ర పావు స్పూను , ఆవాలు అర స్పూను మరియు ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి .
అంతే పుల్ల పుల్లగా ఉండే వాక్కాయలతో పప్పు సర్వింగ్ కు సిద్ధం.
0 comments:
Post a Comment