టమోటో , మునగ కాడలు కందిపప్పు పప్పు చారు .
ఆలూరు కృష్ణప్రసాదు .
తయారీ విధానము.
ఒక అర కప్పు కందిపప్పు ఒకసారి కడిగి కుక్కర్ లో సరిపడా నీళ్ళు , రెండు టమోటో లు ముక్కలుగా తరిగి , మరియు కొద్దిగా పసుపు వేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టౌ ఆపేయాలి .
తర్వాత కుక్కర్ తీసి పప్పు బాగా యెనిపి , అందులో నాలుగు పచ్చిమిర్చి ముక్కలుగా తరిగి , రెండు ములక్కాడలు ముక్కలుగా తరిగి , నిమ్మకాయంత చింతపండు రసం ఒక గ్లాసు నీళ్ళలో పది నిముషాలు నానబెట్టిన రసం , రెండు రెమ్మలు కరివేపాకు , సరిపడా ఉప్పు వేసి మరో గ్లాసు నీళ్ళు పోసి స్టౌ మీద పెట్టి ములక్కాడలు ఉడికే వరకు మరగనివ్వాలి .
ఆ తర్వాత పప్పు చారు దింపాలి .
తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి , నూనె బాగా కాగగానే వరుసగా మూడు ఎండుమిరపకాయలు ముక్కలుగా చేసి , పావు స్పూను జీలకర్ర , అర స్పూను ఆవాలు , కొద్దిగా ఇంగువ మరియు కొద్దిగా కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి .
ఆ తర్వాత కొత్తిమీర తరిగి పైన వేసుకోవాలి .
అంతే ఘమ ఘమ లాడే ములక్కాడ , టమోటో కందిపప్పు పప్పు చారు సర్వింగ్ కు సిద్ధం.
0 comments:
Post a Comment