పునాస కాపు మామిడి కాయలు మళ్ళీ మార్కెట్ లోకి వచ్చాయి .
ఆలూరుకృష్ణప్రసాదు .
ముక్కల పులుసు .
మామిడి కాయ ముక్కలతో . ( చింతపండు బదులుగా )
కావలసినవి .
పుల్లని మామిడి కాయ -- ఒకటి
ఆనపకాయ / సొరకాయ --
కాయలో సగం ముక్క
దోసకాయ -- ఒకటి
పచ్చి మిర్చి --- 5
కరివేపాకు -- మూడు రెబ్బలు
కొత్తిమీర --- ఒక కట్ట
పసుపు --- కొద్దిగా
ఉప్పు --- తగినంత
బియ్యపు పిండి -- స్పూనున్నర
కారం --- అర స్పూను .
పోపుకు .
నూనె --- రెండుస్పూన్లు
ఎండుమిరపకాయలు -- 3
మెంతులు --- కొద్దిగా
జీలకర్ర --- పావు స్పూను
ఆవాలు -- అర స్పూను
ఇంగువ -- కొద్దిగా
తయారీ విధానము .
మామిడి కాయ పై చెక్కు తీసి మాగాయ ముక్కలు తరిగి నట్లుగా తరుగు కోవాలి .
అనపకాయ / సొరకాయ పై చెక్కు తీసి ముక్కలుగా తరుగు కోవాలి.
అదే విధంగానే దోసకాయ కూడా పై చెక్కు తీసి గింజల చేదు చూసుకుని ముక్కలుగా తరుగు కోవాలి.
పచ్చిమిర్చి నిలువుగా చీలికలు గా తరగాలి .
ఒక గిన్నెలో ఈ తరిగిన ముక్కలన్నీ వేసి ఒక రెండు గ్లాసుల నీళ్ళు పోయాలి .
అందులో పసుపు , ఉప్పు , కారం వెయ్యాలి .
పచ్చిమిర్చి , కరివేపాకు కూడా వెయ్యాలి .
ఇప్పుడు స్టౌ వెలిగించి ఈ పులుసు గిన్నె పెట్టి మీడియం సెగన ముక్కలన్నీ ఉడికి దగ్గర పడేలా ఉడకనివ్వాలి .
తర్వాత ఒక అర గ్లాసు నీళ్ళలో ఒకటిన్నర స్పూను బియ్యపు పిండి వేసి చేత్తో బాగా కలిపి మరుగుతున్న పులుసు లో పోయాలి .
మరో మూడు నిముషముల తర్వాత పులుసు చిక్క పడగానే దింపుకోవాలి .
తర్వాత స్టౌ మీద పోపు గరిట పెట్టుకుని రెండు స్పూన్లు నూనె వేసి నూనె కాగగానే ఎండుమిర్చి , మెంతులు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ వేసి పోపు పెట్టు కోవాలి .
పైన తరిగిన కొత్తిమీర వేసుకోవాలి .
అంతే ఘమ ఘమ లాడే ఇంగువ పోపుతో మామిడి కాయతో ఆనప కాయ దోసకాయ ముక్కల పులుసు సర్వింగ్ కు సిద్ధం.
0 comments:
Post a Comment