గట్టి పకోడీలు .
ఆలూరు కృష్ణప్రసాదు
పకోడీలు అందరూ పలు విధాలుగా చేస్తారు .
మెత్తని పకోడీలు , గట్టి పకోడీలు , ఉల్లిపాయ పకోడీలు , కాలీ ఫ్లవర్ పకోడీలు ఇలా రక రకాలుగా చేస్తారు .
శనగ పిండి మరియు బియ్యపు పిండి పాళ్ళలో తేడా ననుసరించి గట్టి పకోడీలు మరియు మెత్తని పకోడీలు చేసుకోవచ్చును .
ఈ మధ్య మెత్తని పకోడీలు గురించి వివరించాను.
అవి ఒక రోజు మాత్రమే నిల్వ ఉంటాయి .
గట్టి పకోడీలు మూడు నాలుగు రోజులు నిల్వ ఉంటాయి .
గట్టి పకోడీలు తయారీ విధానము .
కావలసినవి .
శనగపిండి -- ఒక కప్పు
బియ్యపు పిండి -- పావు కప్పు
ఉల్లిపాయలు -- 4
పచ్చిమిర్చి -- 8
కారం -- స్పూను
ఉప్పు -- తగినంత
తరిగిన కరివేపాకు -- పావు కప్పు .
నూనె -- అర కిలో
తయారీ విధానము .
ముందుగా ఉల్లిపాయలు నిలువుగా తరుగుకోవాలి .
పచ్చిమిర్చి సన్నగా ముక్కలుగా తరుగుకోవాలి .
ఒక బేసిన్ లో తరిగిన ఉల్లిపాయలు , పచ్చి మిర్చి ముక్కలు , తగినంత ఉప్పు , కారం మరియు తరిగిన కరివేపాకు వేసి చేతితో బాగా మెత్తగా కలపాలి .
బాగా తడిగా కొంచెం నీరు నీరుగా వస్తుంది .
అందులో శనగపిండి మరియు బియ్యపు పిండి వేసుకుని కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ గట్టిగా పకోడీలు వేసుకోవడానికి వీలుగా కలుపుకోవాలి .
తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి మొత్తం నూనె పోసి నూనె బాగా కాగగానే చిన్న చిన్న పకోడీలు లాగా వేసి ఎరుపు రంగు వచ్చే దాకా వేయించుకోవాలి .
అంతే గట్టి పకోడీలు అల్పాహారమునకు సిద్ధం ,
0 comments:
Post a Comment