అదిరి పోయే రుచితో ఇడ్లీ , దోశెలు మరియు చపాతీల లోకి కారప్పొడి .
కావలసినవి .
నూనె -- మూడు స్పూన్లు .
ఎండుమిరపకాయలు - 12
పచ్చిశనగపప్పు -- అర కప్పు
చాయమినపప్పు -- అర కప్పు
ధనియాలు -- అర కప్పు
కరివేపాకు -- కప్పు
ఉప్పు -- తగినంత
తయారు చేయు విధానము .
ముందుగా స్టౌ మీద బాండీ పెట్టుకుని నూనె మొత్తము పోసి నూనె బాగా కాగనిచ్చి వరుసగా ఎండుమిరపకాయలు , పచ్చి శనగపప్పు , చాయమినపప్పు , ధనియాలు వేసి బాగా వేగ నివ్వాలి .
తర్వాత అందులో కరివేపాకు కూడా వేసి ఎర్రగా వేగ నివ్వాలి .
చల్లారగానే మొత్తము మిక్సీ లో వేసి పప్పులు పూర్తిగా నలగ కుండా మిక్సీ వేసుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే ఇడ్లీ , దోశెల లోకి కారప్పొడి సిద్ధం.
ఫోటో --- ఇప్పుడే కొట్టిన కారప్పొడి .
0 comments:
Post a Comment