ఆలూరుకృష్ణప్రసాదు .
టమోటా దోశెలు .
మాములుగా దోశెల పిండి అంటే కప్పు మినపప్పు కు రెండున్నర కప్పుల బియ్యం ముందు రోజు రాత్రి నానబోసుకుని ఉదయాన్నే నీళ్ళు వడగట్టి మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి .
అందులో తగినంత ఉప్పు కలుపు కోవాలి .
4 తయారైన టమోటాలు ముక్కలుగా తరుగుకోవాలి.
ఈ టమోటా ముక్కలు , 5 ఎండుమిరపకాయలు , ఒక స్పూను జీలకర్ర మిక్సీలో వేసుకుని మెత్తగా వేసుకోవాలి .
దోశెల పిండిలో ఈ మిశ్రమాన్ని వేసుకుని గరిటతో బాగా కలుపుకుని , స్టౌ మీద పెనం పెట్టి పల్చగా దోశెల లాగా వేసుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే టమోటో వేడి వేడి దోశెలు సర్వింగ్ కు సిద్ధం.
ఒక ఉల్లిపాయ మరియు రెండు పచ్చిమిరపకాయలు సన్నగా ముక్కలుగా తరుగుకొని ఈ దోశెలపై వేసుకోవచ్చు .
ఈ దోశెలు కొబ్బరి చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.
0 comments:
Post a Comment