ఆలూరుకృష్ణప్రసాదు .
కంది కట్టు.
ఇది గోదావరి జిల్లాలలో పెద్ద వాళ్ళందరూ చేసే వారు.
బలవర్ధకమైనది .
తయారీ విధానము .
కంది కట్టు .
మా అత్తగారు కూడా చేస్తారు .
కందిపప్పు లో ఎక్కువగా నీళ్ళు పోసి పప్పు పొంగకుండా ఉడుకుతున్నప్పుడు పై నీళ్ళన్నీ వేరే గిన్నెలోకి తీసే వారు.
తర్వాత అందులో ఉడికిన తర్వాత మెత్తగా యెనిపిన గరిటె కంది పప్పు వేసి బాగా కలిపి , కాస్త ఉప్పు వేసి , ఎండుమిర్చి ముక్కలు, జీలకర్ర , ఆవాలు, ఇంగువ మరియు కరివేపాకు వేసి నేతితో పోపు పెట్టేవారు .
అచ్చు పప్పు చారులా చాలా రుచిగా ఉంటుంది .
మేము కూడా చేసుకుంటాము తరచుగా.
0 comments:
Post a Comment