Showing posts with label అన్నంలోకి వడలు. Show all posts
Showing posts with label అన్నంలోకి వడలు. Show all posts

Saturday, April 14, 2018

పచ్చి వడియాలు

ఆలూరుకృష్ణప్రసాదు .

దాదాపుగా  మార్చి నెల చివరికి  వచ్చేసాము .

ఎండలు  బాగానే  కాస్తున్నాయి .

వేసవి కాలం వచ్చిందంటే  ప్రతి తెలుగు వారి ఇంట్లోనూ హడావుడిగా  ఉంటుంది .

పెద్దవారికి  చేతి నిండా పనే .

పండు మిరపకాయల పచ్చడి  ( కొరివి కారం / పళ్ళ కారం ),
చింతకాయ పచ్చడి , గోంగూర పచ్చడి , ఉసిరి కాయ పచ్చడి ,
వివిధ రకము లైన మామిడి కాయతో పచ్చళ్ళు , ఆవకాయ , మాగాయ.

ఇలా  రెండు నెలల పాటు  అందరి ఇళ్ళల్లోనూ  ఒకటే  హడావుడిగా  ఉంటుంది .

ఇవి కాక ఈ రెండు నెలలూ  సగ్గు బియ్యం  వడియాలు , బియ్యపు పిండి తో వడియాలు , బియ్యపు రవ్వతో వడియాలు , మినపప్పు తో చిన్న వడియాలు , మినపప్పు  తోనే బూడిద గుమ్మడి కాయతో వడియాలు  ఇలా ఈ వేసవి కాలం రెండూ నెలలు ఎండలను కూడా లక్ష్యపెట్టక మన స్త్రీ మూర్తులందరూ ఎర్రని  ఎండలో ఎంతో కష్ట పడతారు .

ఇప్పుడు  నేను ప్రస్తావించబోయే అంశం బూడిద గుమ్మడి కాయతో పచ్చి వడియాలు .

బూడిద గుమ్మడి కాయతో ఏడాదికి  సరిపడా  వడియాలు పెట్టుకునే సమయంలోనే  ఆ రోజు భోజనము  లోకి ఆదరువుగా  గుమ్మడికాయ  ముక్కలను కలిపిన కొంత పిండిని   విడిగా  తీసుకుని  నూనెలో గారెల మాదిరిగా  వేసుకుంటారు .

మరి  రెసిపీ  ఎలాగో తెలుసుకోండి .

**************************

ఆలూరుకృష్ణప్రసాదు .

గుమ్మడికాయ   పచ్చి వడియాలు .

ఏడాదికి   ఒకసారి   గుమ్మడికాయ  వడియాలు  అందరూ  పెట్టుకుంటారు  కదా !

అలా  వడియాలు  పెట్టుకునేముందు  చాలా  మంది  ఆ రోజుకు  అన్నంలోకి  కొంత ముక్కలు  కలిపిన  పిండి  విడిగా  తీసుకుని  నూనెలో  వడియాలు  వేయించు కుంటారు .

ఆ  వడియాలనే  గుమ్మడికాయ పచ్చి వడియాలు  అని  అంటారు.

గోదావరి  జిల్లాలలో  చాలా  కుటుంబాల వారు  ఈ పచ్చి  వడియాలను  వేసుకుంటారు .

మా  ఇంట్లో  అయితే  చిన్న చిన్న  లేత గుమ్మడికాయలు  ప్రత్యేకంగా  తెచ్చుకొని  మూడు నెలలకు  ఒకసారి  అయినా  అన్నంలోకి  ఈ  పచ్చి  వడియాలు  వేసుకుంటాము.
మా ఇంట్లో  అందరికీ   ఈ  వడియాలు  చాలా  చాలా  ఇష్టం.

ఈ  వడియాలు  వేసుకున్న  రోజున భోజనము   లోకి  వేరే  ఐటమ్స్  ఉండవు  కాంబినేషన్  గా  చారు తప్ప .

గారెల  రూపంలో  వేసుకుంటాము .

ఎంతో  రుచిగా  ఉండే  ఈ  గుమ్మడి  కాయ  పచ్చి వడియాలు

తయారీ  విధానము  మీ  కోసం .

మినపగుళ్ళు  --   250  గ్రాములు

గుమ్మడికాయ
లేత దైనా , లేదా
ముదురు దైనా 
షుమారు     ---   1  K.G  కాయ

పచ్చి  మిరపకాయలు   ---
                           200  గ్రాములు

ఇంగువ ----  మరి  కాస్త  ఎక్కువగా .

పసుపు  ---  తగినంత

ఉప్పు    --   తగినంత

నూనె   ---   350  గ్రాములు

తయారీ  విధానము  ---

రేపు  ఉదయము  భోజనాల లోకి  పచ్చి  వడియాలు  వేసుకుందామనుకుంటే  ముందు  రోజు గుమ్మడి  కాయను  పగుల కొట్టి  పై చెక్కు తీయకుండా సొరకాయ  ముక్కలు  తరిగి నట్లుగా  తరుగుకొని  ముక్కలకు  ఉప్పు  , పసుపు  వేసి  ఒక  గుడ్డలో  మూట కట్టి  అందులో  నీళ్ళు  కారి పోయే  విధంగా  పైన  చిన్న  రోలు  కాని , లేదా  బరువు  కానీ  పెట్టుకోవాలి .

మురుసటి  రోజు  ఉదయానికల్లా  నీరు కారిపోతుంది.

మరుసటి రోజు  పిండిలో  ముక్కలనువేయబోయే ముందు
ఒకసారి  ముక్కలను  చేతితో  పిండుకోవాలి.

లేదా  పిండి  పలుచన  అయి  గారెలు  వేయడానికి   రావు .

మినపగుళ్ళు  కూడా  ముందు  రోజు  నాన బోసుకోవాలి  .

మరుసటి  రోజు  నానిన  పప్పు  శుభ్రంగా  కడిగి  మిక్సీ  లేదా  గ్రైండర్లో  పప్పు  ,  తగినంత  ఉప్పు  వేసి  కొద్దిగా   నీళ్ళు  పోస్తూ  గారెల  పిండిలా  గట్టిగా  రుబ్బు కోవాలి .

ఇప్పుడు  చాలా    కొంచెం   నీళ్ళల్లో  ఇంగువ  వేసి  బాగా  కలిపి  ఆ నీళ్ళు  గట్టి పిండిలో  వేయాలి .

ఇప్పుడు  గట్టిగా  పిండిన  గుమ్మడికాయ   ముక్కలు  అందులో వేసి  రెండు సార్లు  తిప్పితే  చాలు  .

పిండి  ముక్కలకు  పడుతుంది . ఇంగువ  వాసనతో.

ముక్కలు  కలిపిన  తర్వాత  కూడా  పిండి  గారెల  పిండిలా  గట్టిగానే  ఉండాలి .

పచ్చి మిరపకాయలు   తొడిమలు  తీసుకొని   ముక్కలుగా  కట్  చేసుకొని   మిక్సీలో  వేసుకోవాలి .

పిండిలో  ఉప్పు  తగ్గినట్లు  అన్పిస్తే
ఈ  పచ్చి మిర్చి  లో  వేసుకుని కలుపుకోండి .

ఇప్పుడు  ముక్కలు  కలిపిన  పిండిని  ఒక  గిన్నెలోకి  తీసుకుని
అందులో  మిక్సీలో  వేసిన  పచ్చి  మిరపకాయల  మిశ్రమం  కలుపు కోవాలి .

భోజనానికి   ముందు 

స్టౌ  మీద  బాండి  పెట్టి మొత్తము  నూనె  పోసి  నూనె  బాగా  కాగిన  తర్వాత  గారెల  మాదిరిగా  వేసుకోవాలి.

ఘమ  ఘమ  లాడే  ఇంగువ  వాసన తో  పచ్చి గుమ్మడికాయ   వడియాలు  (  గారెలు  )  భోజనము   లోకి  సిద్ధం .

హామీ పత్రం.

సంబంధిత  రెసిపీ  మరియు ఫోటో  నా స్వంతం .

Tuesday, December 5, 2017

అరటికాయ చిప్స్

అరటి కాయ  చిప్స్.

ఆంధ్రాలో అరటి కాయ చిప్స్ వాడకం తక్కువ  కాని  కేరళ  తమిళనాడులో  అరటి కాయ చిప్స్ వాడకం బాగా ఎక్కువ .

మేము  అరటి కాయను నీళ్ళలో  ఉంచి పై చెక్కు  తీసి చక్రాలుగా  తరిగి  మరిగే నూనెలో ఎర్రగా వేయించుకుని ఉప్పు కారం వేసుకుంటాము .

అన్నంలో కూరగా నంచుకుని తింటాము.

లేదా  సాంబారులో  అప్పడాల బదులు నంచుకుని తింటాము .

Tuesday, May 30, 2017

రుచికరమైన - కందవడలు

రుచికరమైన - కందవడలు
ఆలూరి కృష్ణ ప్రసాద్

సామాన్యంగా కందతో కంద బచ్చలికూర , కంద చింతపండు రసం బెల్లం వేసి ముద్దకూర , కంద అల్లం పచ్చి మిర్చి కూర చేసుకుంటారు .
కొంతమంది పెసర పప్పుతో భోజనము లోకి కంద అట్టు వేసుకుంటారు .
మేము భోజనము లోకి కంద పెసర పప్పుతో వడలు వేసుకుంటాము .
ఇప్పుడు ఈ కంద వడలు తయారీ విధానము గురించి తెలుసుకుందాం .
కావలసిన పదార్ధాలు :
----------------------------
పావుకిలో కంద
100గ్రా. పెసరపప్పు 
ఉల్లిపాయలు - 4
జీలకర్ర - ఒక చెంచా.
కరివేపాకు - 4 రెబ్బలు
చారెడు బియ్యప్పిండి.
ఉప్పు, కారం - తగినంత. 
నూనె వడలు వేయించడానికి సరిపడా

తయారీ విధానం
---------------------
ముందుగా పెసరపప్పును అరగంట ముందు నానబెట్టుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు , జీలకర్ర వేసి, మిక్సీలో రుబ్బుకోవాలి. 
కంద చెక్కు తీసి, కడిగి ఎండు కొబ్బరి కోరాముతో తురుముకోవాలి. ఇందులో బియ్యప్పిండి, తగినంత ఉప్పు, కారం, పైన రుబ్బిన ముద్ద, కలుపుకుని, నూనెలో వడల లాగా ఎర్రగా వేపుకోవాలి. ఇవి అన్నంలో తిన్నా, విడిగా తిన్నా రుచికరంగా ఉంటాయి. అందుకే పిల్లలు ఓసారి రుచి చూస్తే ఇక వదలరు. ప్రయత్నించండి.

Sunday, May 28, 2017

గుమ్మడికాయ పచ్చి వడియాలు .

గుమ్మడికాయ పచ్చి వడియాలు .
ఆలూరి కృష్ణ ప్రసాద్

ఏడాదికి ఒకసారి గుమ్మడికాయ వడియాలు అందరూ పెట్టుకుంటారు కదా !
అలా వడియాలు పెట్టుకునేముందు చాలా మంది ఆ రోజుకు అన్నంలోకి కొంత ముక్కలు కలిపిన పిండి విడిగా తీసుకుని నూనెలో వడియాలు వేయించు కుంటారు .
ఆ వడియాలనే గుమ్మడికాయ పచ్చి వడియాలు అని అంటారు.
గోదావరి జిల్లాలలో చాలా కుటుంబాల వారు ఈ పచ్చి వడియాలను వేసుకుంటారు .
మా ఇంట్లో అయితే చిన్న చిన్న లేత గుమ్మడికాయలు ప్రత్యేకంగా తెచ్చుకొని మూడు నెలలకు ఒకసారి అయినా అన్నంలోకి ఈ పచ్చి వడియాలు వేసుకుంటాము.
మా ఇంట్లో అందరికీ ఈ వడియాలు చాలా చాలా ఇష్టం.

ఈ వడియాలు వేసుకున్న రోజున భోజనము లోకి వేరే ఐటమ్స్ ఉండవు కాంబినేషన్ గా చారు తప్ప .
గారెల రూపంలో వేసుకుంటాము .
ఎంతో రుచిగా ఉండే ఈ గుమ్మడి కాయ పచ్చి వడియాలు
తయారీ విధానము మీ కోసం .
మినపగుళ్ళు -- 250 గ్రాములు
గుమ్మడికాయ 
లేత దైనా , లేదా 
ముదురు దైనా 
 షుమారు --- 1 K.G కాయ

పచ్చి మిరపకాయలు ---
200 గ్రాములు 
ఇంగువ ---- మరి కాస్త ఎక్కువగా .

పసుపు --- తగినంత
ఉప్పు -- తగినంత
నూనె --- పావు కిలో
తయారీ విధానము ---
రేపు ఉదయము భోజనాల లోకి పచ్చి వడియాలు వేసుకుందామనుకుంటే ముందు రోజు గుమ్మడి కాయను పగుల కొట్టి సొరకాయ ముక్కలు తరిగి నట్లుగా తరుగుకొని ముక్కలకు ఉప్పు , పసుపు వేసి ఒక గుడ్డలో మూట కట్టి అందులో నీళ్ళు కారి పోయే విధంగా పైన చిన్న రోలు కాని , లేదా బరువు కానీ పెట్టుకోవాలి .
మురుసటి రోజు ఉదయానికల్లా నీరు కారిపోతుంది.
మరుసటి రోజు పిండిలో వేయబోయే ముందు
ఒకసారి ముక్కలు కూడా చేతితో పిండుకోవాలి.
లేదా పిండి పలుచన అయి గారెలు వేయడానికి రావు .
మినపగుళ్ళు కూడా ముందు రోజు నాన బోసుకోవాలి .
మరుసటి రోజు నానిన పప్పు శుభ్రంగా కడిగి మిక్సీ లేదా గ్రైండర్లో పప్పు , తగినంత ఉప్పు వేసి కొద్దిగా నీళ్ళు పోస్తూ గారెల పిండిలా గట్టిగా రుబ్బు కోవాలి .
ఇప్పుడు చాలా కొంచెం నీళ్ళల్లో ఇంగువ వేసి బాగా కలిపి ఆ నీళ్ళు గట్టి పిండిలో వేయాలి .
ఇప్పుడు గట్టిగా పిండిన గుమ్మడికాయ ముక్కలు అందులో వేసి రెండు సార్లు తిప్పితే చాలు .
పిండి ముక్కలకు పడుతుంది . ఇంగువ వాసనతో.
ముక్కలు కలిపిన తర్వాత కూడా పిండి గారెల పిండిలా గట్టిగానే ఉండాలి .
పచ్చి మిరపకాయలు తొడిమలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి .
పిండిలో ఉప్పు తగ్గినట్లు అన్పిస్తే
ఈ పచ్చి మిర్చి లో కలుపుకోండి .

ఇప్పుడు ముక్కలు కలిపిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని 
అందులో మిక్సీలో వేసిన పచ్చి మిరపకాయల మిశ్రమం కలుపు కోవాలి .

భోజనానికి ముందు
స్టౌ మీద బాండి పెట్టి నూనె పోసి నూనె బాగా కాగిన తర్వాత గారెల మాదిరిగా వేసుకోవాలి.
ఘమ ఘమ లాడే ఇంగువ వాసన తో పచ్చి గుమ్మడికాయ వడియాలు ( గారెలు ) భోజనము లోకి సిద్ధం .

Followers

All rights reserved by ఆహా ఏమి రుచి