ఆలూరుకృష్ణప్రసాదు .
శాకాహార ప్రియులకు అత్యుత్తమ మైనది.
ముద్ద పప్పు & కొత్తావకాయ .
**********************
తర తరాల నుండి వస్తున్న ముద్ద పప్పు.
తయారీ విధానము .
ఒక ఇత్తడి గిన్నెలో రెండు స్పూన్లు నెయ్యి వేసి బాగా కాగగానే ఒక కప్పు కందిపప్పు వేసి బాగా వేయించుకుని తగినన్ని నీళ్ళు పోసి మూతపెట్టి ఒక పదిహేను నిముషముల పాటు మెత్తగా ఉడకనివ్వాలి .
నెయ్యి వేసి వేయించాము కనుక ఇంక పప్పు పొంగదు .
పప్పు మెత్తగా ఉడకగానే సరిపడా ఉప్పు వేసి గరిటతో బాగా యెనిపి వేరే స్టీలు గిన్నెలోకి తీసుకోవాలి .
ఇత్తడి గిన్నెలోనే ఉంచితే కొద్ది సేపటికి కిలం వస్తుందని పెద్దలు చెప్పే వారు.
ఇత్తడి గిన్నె లేని వారు ఇదే పద్థతి లో స్టీలు గిన్నెలో చేసుకోవచ్చు.
Best Combinations .
ముద్ద పప్పు + కొత్తావకాయ + నెయ్యి .
ముద్ద పప్పు + ముక్కల పులుసు + పేరుకున్న నెయ్యి
ముద్ద పప్పు + కొత్త నిమ్మకాయ + నెయ్యి
ముద్ద పప్పు + మజ్జిగ పులుసు
ముద్ద పప్పు + గుత్తి వంకాయ కూర + నెయ్యి
వేడి వేడి అన్నంలో పై విధంగా తింటే ఆ రుచే అత్యద్భుతం.
కొస మెరుపు .
" బ్రాహ్మణో భోజన ప్రియః ".
( బహుజన ప్రియ అని కూడా అంటారు . )
" లక్ష రూపాయి లిచ్చినా తృప్తి పడని వ్యక్తి
కడుపు నిండా భోజనము చేయగానే సంతుష్టు డవుతాడు ."
" అన్నదాతా సుఖీభవ ."
****************************
ఆలూరుకృష్ణప్రసాదు .
కొత్తావకాయ .
పుల్లని గట్టిగా ఉన్న మామిడి కాయలు చూడగానే మళ్ళీ ఈ రోజు కొత్తావకాయ పెట్టాము.
ఎంతైనా కొత్తావకాయ రుచే అద్భుతం కదండీ .
ఆలూరుకృష్ణప్రసాదు .
కొత్తావకాయ .
మామిడి కాయలు ఇప్పుడు మార్కెట్లోకి విరివిగా వస్తున్నాయి .
ఈ మామిడి కాయలు ముక్క బాగా గట్టిగా ఉండి , ముక్క పీచు ఉండి చాలా పుల్లగా ఉంటే ఆవకాయ చాలా రుచిగా ఉంటుంది .
ఈ రోజు రెండు మామిడి కాయలతో కొత్తావకాయ వేసాము.
ఎంతైనా కొత్తావకాయ రుచే వేరు కదండీ .
***************************
కావలసినవి .
మామిడి కాయలు - 2
కారం -- 75 గ్రాములు
ఆవపిండి -- 60 గ్రాములు
మెత్తని ఉప్పు -- 50 గ్రాములు
మెంతులు -- స్పూను
పసుపు -- స్పూను
పప్పు నూనె -- 150 గ్రాములు
తయారీ విధానము .
మామిడి కాయలు కడిగి పొడి గుడ్డ పెట్టుకుని తడిలేకుండా తుడుచుకుని పై చెక్కు తీయకుండా మధ్యకు తరుగుకొని , మధ్యలో జీడి మరియు లోపల పొర తీసివేసి ముక్కలుగా తరుగుకోవాలి .
ఈ ముక్కలలో గరిటెడు నూనె , మొత్తము పసుపు వేసి చేతితో బాగా కలుపుకొని విడిగా ఉంచుకోవాలి .
ఒక బేసిన్ లో కారం , ఆవ పిండి , ఉప్పు మరియు మెంతులు వేసుకుని , చేతితో బాగా కలుపుకోవాలి .
అందులో కలిపిన ముక్కలు మరియు మొత్తము నూనె వేసుకుని బాగా కలుపుకుని ఒక జాడీలోకి తీసుకోవాలి .
మరుసటి రోజునుండి ఈ ఆవకాయ తిరగ కలిపి వాడుకోవచ్చు .
ఆలూరుకృష్ణప్రసాదు .
రెసిపీ మేము తయారు చేసిన విధానము . ఫోటో ఈ రోజు తయారు చేయు సమయమున తీసినది.
0 comments:
Post a Comment